తిక్కతో సాయి తెలుగులో నెంబర్‌వన్ హీరో అవుతాడు
- August 01, 2016
సాయిధరమ్‌తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్‌పై సునీల్‌రెడ్డి దర్శకత్వంలోసి.రోహిణ్‌కుమార్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'తిక్క'. లారిస్సా బోనేసి, మన్నార్ చోప్రా హీరోయిన్స్‌గా నటించారు. ఎస్.ఎస్.్థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి జానారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్, కె.యస్.రామారావు, ఎ.యస్.రవికుమార్ చౌదరి, కోనవెంకట్, అంజన్‌కుమార్ యాదవ్, మాగంటి గోపీనాథ్, దిల్‌రాజు, ఎస్.ఎస్.్థమన్, వంశీ పైడిపల్లి తదితరులు హాజరయ్యారు. ఆడియో సీడీలను వంశీ పైడిపల్లి విడుదల చేసి తొలి సీడీని సాయిధరమ్‌తేజ్‌కు అందించారు. అనంతరం జానారెడ్డి మాట్లాడుతూ, 'దర్శక నిర్మాతలు, హీరో హీరోయిన్లు సహా ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌కు అభినందలు. తిక్క అంటే అత్యంత ఇష్టమో, ఏదైనా విషయాన్ని సీరియస్ తీసుకోవడమో అని అనుకుంటున్నాను. భవిష్యత్‌లో ఇంకా మంచి సినిమాలు చేసి నిర్మాత మంచి స్థాయికెళ్లాలి. సినిమా విడుదలై అందరి ఆదరణ పొందాలని కోరుకుంటున్నా' అని అన్నారు. ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ, సాయి తెలుగులో నెంబర్‌వన్ హీరో అవుతాడని, మా రోహిణ్‌రెడ్డి పట్టిందంతా బంగారమై, సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని అన్నారు. దర్శకుడు ఈ సినిమాతో పెద్ద హిట్ కొడతాడని అన్నారు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ 'చిరంజీవి, పవన్‌కళ్యాణ్ ఆశీర్వాదాలతోనే ఇక్కడకు రాగలిగానని, జీవితాంతం వారికెప్పుడూ నేను రుణపడే ఉంటాను. కథ వినగానే బ్రేకప్ లవ్‌స్టోరీ, నేను బాగా కనెక్ట్ అయ్యానని. సునీల్‌రెడ్డితో ఎప్పటినుండో మంచి పరిచయం ఉందని. అలీ, రఘుబాబు సహా చాలామంది సీనియర్ ఆర్టిస్టులతో పనిచేయడం మరచిపోలేనని అన్నారు.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్‌లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







