యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- March 06, 2026
యూఏఈ: యూఏఈలో విమానయాన రంగం నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. యూఏఈ బేస్డ్ విమానయాన సంస్థలు పరిమిత షెడ్యూల్ కార్యకలాపాలను ప్రకటించాయి. ప్రాంతీయంగా కొనసాగుతున్న సైనిక సంఘర్షణల మధ్య వైమానిక పరిమితుల కారణంగా దుబాయ్ ప్రధాన క్యారియర్ ఎమిరేట్స్ దాదాపు 100 కంటే ఎక్కువ ఫ్లైట్ షెడ్యూల్ ను ప్రకటించింది.
మార్చి 5 మరియు 6 తేదీల్లో దుబాయ్ నుండి 100 కి పైగా విమానాలు బయలుదేరి తిరిగి వస్తాయని ఎయిర్‌లైన్ తెలిపింది. అయితే, ప్రయాణికులు ధృవీకరించిన బుకింగ్ కలిగి ఉంటేనే విమానాశ్రయానికి వెళ్లాలని ఎయిర్‌లైన్ పునరుద్ఘాటించింది. ఫిబ్రవరి 28 మరియు మార్చి 31 మధ్య ప్రయాణించడానికి బుక్ చేసుకున్న ప్రయాణీకులు ఏప్రిల్ 30న లేదా అంతకు ముందు ప్రయాణం కోసం ప్రత్యామ్నాయ విమానంలో తిరిగి బుక్ చేసుకోవచ్చు అని ఎమిరేట్స్ తెలిపింది.
యూఎస్- ఇజ్రాయెల్ మరియు ఇరాన్‌లతో యుద్ధం ప్రారంభమైన తర్వాత యూఏఈ మరియు ఇతర గల్ఫ్ దేశాలు తమ వైమానిక ప్రాంతాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో వేలాది మంది ప్రయాణికులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయారు. ఇక దుబాయ్ రెండవ క్యారియర్ ఫ్లైదుబాయ్ కూడా దాని నెట్‌వర్క్‌లో తక్కువ షెడ్యూల్‌తో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది.
ఫ్లైదుబాయ్ నెట్‌వర్క్‌లో దుబాయ్ ద్వారా కనెక్ట్ అయ్యే ప్రయాణీకులు కనెక్టింగ్ ఫ్లైట్ పనిచేస్తుంటే మాత్రమే వారిని ప్రయాణించడానికి అనుమతిస్తామని ఎయిర్‌లైన్ తెలిపింది.
అబుదాబిలోని జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం (AUH) కూడా అబుదాబి సమన్వయంతో పరిమిత సంఖ్యలో విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. షార్జాకు చెందిన ఎయిర్ అరేబియా విమానాలు కూడా మార్చి 9న మధ్యాహ్నం 3 గంటల వరకు తాత్కాలికంగా నిలిపివేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







