యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్‌లైన్‌లో ఎగ్జామ్స్..!!
- March 06, 2026
యూఏఈ: యూఏఈలోని కొన్ని ఇండియన్ సిలబస్ బోధించే స్కూల్స్ పరీక్షలను ఆన్ లైన్ లో నిర్వహించనున్నాయి. అలాగే, షార్జా తన కొత్త విద్యా సంవత్సరం ప్రారంభాన్ని ఒక వారం వాయిదా వేశాయి. మార్చి 23న ప్రారంభం కావాల్సిన స్కూల్స్.. మార్చి 30న ప్రారంభమవుతాయని ఎమిరేట్‌లోని ఇండియన్ స్కూల్స్ మేనేజ్ మెంట్లు వెల్లడించాయి.
యూఏఈ విద్యా మంత్రిత్వ శాఖ సమ్మర్ సెలవులను మార్చి 9–22కి మార్చాలని తీసుకున్న నిర్ణయం తరువాత, అనేక భారతీయ స్కూల్స్ తమ అకాడమిక్ ఇయర్ ను సర్దుబాటు చేశాయి.
CBSE (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) మరియు CISCE (కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్) పాఠశాలల్లోని సిబ్బంది మరియు విద్యార్థులకు కొత్త ప్రణాలిక వర్తంచనుందని అంబాసిడర్ స్కూల్ షార్జా ప్రిన్సిపాల్ డాక్టర్ ఆరోగ్య రెడ్డి తెలిపారు.
అనేక CBSE మరియు CISCE పాఠశాలలు వారి అకాడమిక్ ఇయర్ ముగింపు దశకు చేరుకున్నందున కొన్ని అసెస్‌మెంట్‌లు ఆన్‌లైన్‌లోకి మారాయని రాయల్ అకాడమీ అజ్మాన్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రేమ మురళీధర్ తెలిపారు. కాగా, భారతీయ పాఠ్యాంశాలు బోధించే స్కూల్స్ ఇయర్ ఎండ్ సెలవలు భారత్ లోని అకాడమిక్ సెలవులకు సమానంగా ఉండేలా షెడ్యూల్ ఉంటుందని పేర్కొన్నారు.
CBSE పాఠశాలల్లో ఏప్రిల్ నుండి మార్చి వరకు అకాడమిక్ ఇయర్ ను అనుసరిస్తాయని, అంటే ఏప్రిల్ 2026 నుండి మార్చి 2027 వరకు రాబోయే సెషన్‌కు సిద్ధమవుతాయిని వివరించారు. స్కూల్స్ అధికారిక ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తాయని వుడ్లెం పార్క్ స్కూల్ అజ్మాన్ ప్రిన్సిపాల్ భాను శర్మ తెలిపారు.
అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు సమ్మర్ సెలవులు మార్చి 9 నుండి మార్చి 22 వరకు కొనసాగుతాయని యూఏఈ విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించిన తరువాత, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ)తో అనుబంధంగా ఉన్న భారతీయ పాఠ్య ప్రణాళిక పాఠశాలలు అధికారులు జారీ చేసిన ఆదేశాలు వర్తిస్తాయా లేదా అన్నది స్పష్టత రావాల్సి ఉందన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







