మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- March 06, 2026
మస్కట్: ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితి కారణంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేసింది. ఒమన్ మరియు ఇతర మధ్యప్రాచ్య దేశాలలోని పాఠశాలలకు XII తరగతి పరీక్షలను వాయిదా వేసింది. ఈ మేరకు మార్చి 5న సర్క్యులర్ జారీ చేసింది. మార్చి 7 నుండి మార్చి 11వరకు జరగాల్సిన అన్ని పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు బోర్డు తెలిపింది. గతంలో మార్చి 2, 5 మరియు 6 వ తేదీలలో వాయిదా వేసిన పరీక్షలను కూడా రద్దు చేసినట్లు బోర్డు తెలిపింది. మధ్యప్రాచ్యంలో పదవ తరగతి అభ్యర్థుల ఫలితాల ప్రకటన విధానాన్ని తరువాత తెలియజేస్తామని బోర్డు తెలిపింది.
అలాగే, XII తరగతికి సంబంధించి మార్చి 7న జరగాల్సిన పరీక్షను వాయిదా వేశారు. సవరించిన తేదీలను తరువాత ప్రకటిస్తామన్నారు. మార్చి 7న పరిస్థితిని సమీక్షించి, మార్చి 9 నుండి జరగనున్న పరీక్షలకు సంబంధించి తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని CBSE తెలిపింది. ఈ సర్క్యులర్ బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యూఏఈలోని CBSE అనుబంధ పాఠశాలలకు వర్తిస్తుందని తెలిపింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







