కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- March 06, 2026
కువైట్: కువైట్ వైమానిక ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేయడం వల్ల ఆ దేశంలో చిక్కుకున్న భారతీయ ప్రయాణీకులతో చర్చలు కొనసాగిస్తున్నామని, వారికి అవసరమైన చర్యలను కొనసాగిస్తున్నామని కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
మిడిలీస్టులో నెలకొన్న పరిస్థితుల వల్ల ప్రభావితమైన భారతీయ పౌరులకు మద్దతు ఇవ్వడంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నామని తెలిపింది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని రాయబార కార్యాలయం తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
విమానాశ్రయం మూసివేత తర్వాత కొన్ని వందల మంది ట్రాన్సిట్ ప్రయాణికులు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. బాధిత ప్రయాణీకులకు కువైట్‌లోని ఒక హోటల్‌లో స్టే ఏర్పాటు చేశారు. వారు తమ ప్రయాణ ఏర్పాట్ల కోసం ఎదురు చూస్తున్నారు.
కాగా, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, సంబంధిత అధికారులతో నిరంతరం టచ్ లో ఉన్నామని అధికారులు తెలిపారు. సాధారణ విమాన కార్యకలాపాలు పునరుద్ధరించబడే వరకు భారతీయ పౌరులకు అవసరమైన సహాయం చేయడం కొనసాగిస్తామని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







