కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- March 06, 2026
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 16ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. సిద్ధరామయ్య మాట్లాడుతూ.. పెరుగుతున్న మొబైల్ వినియోగం వల్ల పిల్లలపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను అరికట్టడమే ఈ నిర్ణయానికి ముఖ్య ఉద్దేశం అని అన్నారు.
పిల్లల్లో సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించాలనే అంశంపై కర్ణాటక ప్రభుత్వం గత కొంతకాలంగా చర్చలు జరుపుతోంది. సీఎం సిద్ధరామయ్య గత నెలలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్ లర్లతో జరిపిన చర్చల్లో ఈ అంశాన్ని లేవనెత్తారు. పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్‌కు సంబంధించి వారి నుంచి అభిప్రాయాలు కోరారు. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు, నిపుణులు, పిల్లల అభిప్రాయాలు సేకరించి తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా 16ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై బ్యాన్ విధిస్తూ ప్రకటన చేశారు.
ఆస్ట్రేలియా గత ఏడాది డిసెంబర్ నెలలో 16ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టం అమలు చేసింది. ఆస్ట్రేలియా కంటే ముందే.. అమెరికాలోని పలు రాష్ట్రాలు స్థానిక చట్టాల ద్వారా పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నియంత్రణ చర్యలు చేపట్టాయి. అయితే, ఆస్ట్రేలియా ప్రభుత్వం స్ఫూర్తితో యూరోపియన్ యూనియన్ ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. మరికొన్ని దేశాలు చిన్న పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించేందుకు సిద్ధమవుతున్నాయి.
భారత దేశం విషయానికి వస్తే.. చిన్నారులు సోషల్ మీడియా వాడకంపై బ్యాన్ విధించేలా ఆలోచన చేస్తున్నామని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఆ మేరకు చర్యలు ప్రారంభించామని అన్నారు. అయితే, తాజాగా కర్ణాటక ప్రభుత్వం 16ఏళ్లలోపు చిన్నారులు సోషల్ మీడియా వాడకంపై బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తద్వారా దేశంలోనే తొలి రాష్ట్రంగా నిలిచింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పెయిడ్ కార్ లిఫ్ట్‌లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!
- హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ..ఫ్రాన్స్‌తో జీసీసీ కీలక చర్చలు..!!
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక







