నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- March 07, 2026
కువైట్: కువైట్ ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా..ఆ దేశ జాతీయ జల నియంత్రణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. జల నెట్‌వర్క్ కార్యకలాపాలను సమీక్షించారు. ప్రధానమంత్రితో పాటు విద్యుత్ మరియు నీటి నెట్‌వర్క్ మంత్రి డాక్టర్ సబా అబ్దులాజీజ్ అల్-ముఖైజిమ్ మరియు మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ అదెల్ మొహమ్మద్ అల్-జమిల్ ఉన్నారు.
తన పర్యటనలో భాగంగా జల వ్యవస్థ పనితీరును నిశితంగా పరిశీలించారు. వాటర్ నెట్‌వర్క్ పనితీరును పరిశీలించారు.అత్యవసర పరిస్థితులకు సమర్థవంతంగా స్పందించడానికి సాంకేతిక బృందాల సంసిద్ధతను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వర్కింగ్ టీముల అంకితభావాన్ని, కృషిని ప్రశంసించారు.
దేశవ్యాప్తంగా అవసరమైన సేవలు మరియు మౌలిక సదుపాయాల స్థిరత్వాన్ని కొనసాగించడానికి నిరంతర అప్రమత్తత, సంసిద్ధత ప్రాముఖ్యతను ప్రధానమంత్రి తెలియజేశారు.
తాజా వార్తలు
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన
- దుబాయ్లో పెయిడ్ కార్ లిఫ్ట్లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్ఫోర్స్ సమీక్ష..!!







