ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- March 07, 2026
మనామా: ఇరాన్ దురాక్రమణ నేపథ్యంలో బహ్రెయిన్ కు నాటో కూటమి మద్దతుగా నిలిచింది. బహ్రెయిన్ రాజ్యానికి తన సంఘీభావం తెలుపుతూ నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే నుండి రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకు మేసెజ్ పంపించారు. ఈ సందేశంలో..బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ చేస్తున్న నిరంతర మరియు ఆమోదయోగ్యం కాని దాడులను సెక్రటరీ జనరల్ ఖండించారు.
పౌరులు మరియు కీలకమైన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చేస్తున్న విచక్షణారహిత దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది నావిగేషన్ స్వేచ్ఛకు కూడా ముప్పు కలిగిస్తుందన్నారు. బహ్రెయిన్ మరియు నాటో మధ్య కొనసాగుతున్న భాగస్వామ్యాన్ని సెక్రటరీ జనరల్ ప్రశంసించారు. గల్ఫ్ ప్రాంతంలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి మరియు ప్రపంచ శాంతిని ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన
- దుబాయ్‌లో పెయిడ్ కార్ లిఫ్ట్‌లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!
- హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ..ఫ్రాన్స్‌తో జీసీసీ కీలక చర్చలు..!!
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు







