డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- March 07, 2026
యూఏఈ: యూఎస్-ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం కొనసాగుతోంది.యూఏఈ నివాసితులు తమ ఫోన్లలో అత్యవసర హెచ్చరిక వినిపించినప్పుడు తీసుకోవలసిన చర్యలతో బాగా పరిచయం పెంచుకున్నారు.ఆఫీసు లేదా ఇంటి వాతావరణంలో జాగ్రత్తలు తీసుకోవడం సులభం అయినప్పటికీ..లోపలి గదులకు వెళ్లడం, కిటికీలు మరియు తలుపుల నుండి దూరంగా ఉండటం లాంటి చర్యలు తీసుకోవడం సులభం.
మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే? అప్పుడు ప్రశాంతంగా ఉండాలి. జాగ్రత్తగా డ్రైవింగ్ కొనసాగించాలి. రోడ్డుపై అకస్మాత్తుగా ఆపవద్దు లేదా అనవసరంగా పక్కకు వెళ్లవద్దు. సమీపంలో ఏదైనా సైనిక కార్యకలాపాలను గమనించినట్లయితే, దానిని వీడియో, ఫోటోలు తీయవద్దు. అది మిమ్మల్ని రోడ్డు నుండి దృష్టి మళ్లేలా చేస్తుంది. ఆ తర్వాత కూడా మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేయవచ్చు.
మీరు సురక్షితంగా మీ గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత, వెంటనే లోపలికి వెళ్లి కిటికీలకు దూరంగా ఉన్న లోపలి ప్రదేశంలో ఆశ్రయం పొందాలి. అధికారికంగా స్పష్టమైన నోటిఫికేషన్ జారీ అయ్యే వరకు అక్కడే ఉండాలి.
అధికారిక మార్గాల ద్వారా సమాచారం అందించాలని, ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని అధికారులు ప్రజలకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయంలో క్యాట్-III రన్వే సామర్థ్యం మెరుగుదల
- డిసెంబర్ 4 నుంచి 32వ దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్..
- ఘనంగా గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ 28వ వార్షికోత్సవం..
- యూఏఈ ప్రాదేశిక జలాల్లో నౌకపై దాడి.. దెబ్బతిన్న ADNOC నౌక
- 2027 నుంచి సౌదీ అరేబియాలో అల్ట్రా లగ్జరీ ఎడారి రైలు..బుకింగ్స్ ప్రారంభం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- అన్నవరం గిరి ప్రదక్షిణ గీతం ఆవిష్కరణ-డా.గజల్ శ్రీనివాస్
- ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా డీఎస్పీలు విధులు నిర్వహించాలి: సీఎం రేవంత్
- 14, 15 తేదీల్లో ఈదురుగాలులు.. జాగ్రత్త
- తెలంగాణ గవర్నర్తో కర్ణాటక గవర్నర్ మర్యాదపూర్వక భేటీ







