దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్‌వేస్
- March 07, 2026
దోహా : ఖతార్ వైమానిక ప్రాంతం మూసివేత కారణంగా షెడ్యూల్ చేసిన విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఖతార్ ఎయిర్‌వేస్ ప్రకటించింది.
ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఖతార్ వైమానిక ప్రాంతాన్ని సురక్షితంగా తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన తర్వాతనే తమ సంస్థ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తుందని ఎయిర్‌లైన్ తెలిపింది.
మార్చి 8న ఉదయం 9 గంటలకు (06:00 UTC) తాజా అప్డేట్ లను ప్రకటిస్తామని X లో ఒక ప్రకటనలో ఎయిర్‌లైన్ తెలిపింది.
ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ సురక్షితమైన ఆపరేటింగ్ కారిడార్‌ను నిర్ధారించిన తర్వాత, ఖతార్ ఎయిర్‌వేస్ మార్చి 8న లండన్, పారిస్, మాడ్రిడ్, రోమ్, ఫ్రాంక్‌ఫర్ట్ మరియు బ్యాంకాక్ నుండి హమద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాలను నడపాలని భావిస్తున్నట్లు వెల్లడించింది.
ఈ విమానాలు తుది గమ్యస్థానానికి చేరుకునే ప్రయాణీకులకు మాత్రమే అని స్పష్టం చేసింది. దోహాలో షెడ్యూల్ చేయబడిన వాణిజ్య కార్యకలాపాల పునఃప్రారంభానికి నిర్ధారణ కాదని పేర్కొంది.
ప్రయాణికులు తాజా ప్రయాణానికి సంబంధించి ధృవీకరించబడిన టికెట్ ఉంటనే విమానాశ్రయానికి రావాలని ఖతార్ ఎయిర్‌వేస్ సూచించింది. మరింత సమాచారం, లేదా తాజా అప్డేట్ ల కోసం ఖతార్ ఎయిర్‌వేస్ అధికారిక ఛానల్స్ ను ఫాలో కావాలని కోరింది.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







