సెక్యూరిటీ అలెర్ట్ ను ఎత్తేసిన యూఏఈ..!!

- March 08, 2026 , by Maagulf
సెక్యూరిటీ అలెర్ట్ ను ఎత్తేసిన యూఏఈ..!!

యూఏఈ: గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణలు చెప్పడంతోపాటు ఇక గల్ఫ్ దేశాలపై దాడులు చేయబోమని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గతంలో జారీ చేసిన భద్రతా హెచ్చరికను ఎత్తివేసింది. నివాసితులు పరిస్థితి "ప్రస్తుతం సురక్షితంగా" ఉందని హామీ ఇచ్చి సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని సూచించింది.

అయితే, అధికారిక సూచనలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని మరియు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని నివాసితులను అధికార యంత్రాంగం కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com