కువైట్ లో అదుపులో ఎయిర్ పోర్ట్ ఫ్యుయల్ ట్యాంక్ ఫైర్..!!
- March 08, 2026
కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇంధన ట్యాంకులలో సంభవించిన మంటలను తమ అగ్నిమాపక బృందాలు విజయవంతంగా అదుపులోకి తెచ్చాయని కువైట్ అగ్నిమాపక దళం ప్రకటించింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని ధృవీకరించింది.
ఈ మేరకు పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా డైరెక్టర్ మరియు కువైట్ అగ్నిమాపక దళం అధికారిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అల్-గరీబ్ తెలిపారు. విమానాశ్రయంలో అగ్నిమాపక చర్యలు వేగంగా మరియు సమర్థవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు.
విమానాశ్రయంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ఇతర అగ్నిమాపక బృందాలు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ఫర్ సోషల్ సెక్యూరిటీ ప్రధాన కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదాన్ని సమర్థంగా అదుపులోకి తెచ్చారని అల్-గరీబ్ తెలిపారు. అయితే, పరిస్థితులు పూర్తిగా సురక్షితంగా ఉండేలా రెస్పాన్స్ టీమ్స్ ను మోహరించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







