ఆ రెండు కేసుల్లోనే అబార్షన్..షురా కౌన్సిల్ ఆమోదం..!!
- March 09, 2026
మనామా: అబార్షన్ కు సంబంధించి మినహాయింపుపై షురా కౌన్సిల్ క్లారిటీ ఇచ్చింది. తాజాగ కౌన్సిల్ ఆమోదించిన ప్రతిపాదన ప్రకారం ప్రాణాంతకమైన పిండం లోపాలు మరియు తల్లికి ప్రమాదం అనే రెండు సందర్భాల్లోనే చట్టపరమైన గర్భస్రావం(అబార్షన్) క అనుమతిస్తారు.
మిగతా సందర్భాల్లో అబార్షన్ కు వెళ్లడాన్ని క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. సంబంధిత అధికారుల నుంచి అనుమతి, నిపుణుల నివేదికలు ఉన్న కేసుల్లో లైసెన్స్ పొందిన ఆసుపత్రులలో మాత్రమే అబార్షన్ కు అనుమతిస్తారని సర్వీసెస్ కమిటీ అధిపతి డాక్టర్ జమీలా అల్ సల్మాన్ స్పష్టం చేశారు. గల్ఫ్ అంతటా చట్టాలను పరిశీలించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇక అబార్షన్ కు బహ్రెయిన్‌లో ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ పొందిన ముగ్గురు కన్సల్టెంట్ వైద్యులతో కూడిన వైద్య కమిటీ ధృవీకరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే, సంబంధిత నిపుణుల పర్యవేక్షణలోనే అబార్షన్ ప్రక్రియను నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ సందర్భాల్లో మినహా సదరు మహిళ రాతపూర్వక అనుమతి కూడా అవసరం అవుతుందని డాక్టర్ జమీలా అల్ సల్మాన్ వెల్లడించారు.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









