80 అదనపు విమానాలు..97వేల మందికి లబ్ధి..!!
- March 09, 2026
మస్కట్: గత వారంలో దాదాపు 80 అదనపు విమానాలను నడిపినట్లు ఒమన్ ఎయిర్ తెలిపింది. దాదాపు 97వేల మందికి పైగా ప్రయాణికులు స్వదేశానికి తిరిగి రావడానికి సహాయపడినట్లు ప్రకటించింది.
“వైమానిక స్థావరం మూసివేత కారణంగా పరిమిత సంఖ్యలో ప్రాంతీయ మార్గాలు తాత్కాలికంగా ప్రభావితమైనప్పటికీ..యూరప్, ఆగ్నేయాసియా మరియు ఆఫ్రికాలో విస్తరించి ఉన్న మా అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో ఎక్కువ భాగం ప్రణాళిక ప్రకారం పనిచేస్తోంది. సాధ్యమైన చోట అదనపు ఫ్రీక్వెన్సీలను జోడిస్తూనే ఉన్నాము.” అని ఒమన్ ఎయిర్ ఒక ప్రకటనలో తెలిపింది.
యూఏఈ నుండి ఒమన్‌కు భూ సరిహద్దు దాటే ప్రయాణికులకు ఫ్లైట్ సర్వీసులను పొందేందుకు వీలుగా ఎయిర్ పోర్టు వరకు బస్సు సర్వీసులను కూడా అందుబాటులో పెట్టినట్లు ఒమన్ ఎయిర్ వెల్లడించింది.
తాజా వార్తలు
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి
- బహ్రెయిన్ చారిత్రక ప్రాంతాల పునరుద్ధరణకు చర్యలు..!!
- ఖతార్‌లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు.. వాటర్ లైన్ నిర్వహణ పనులు..!!
- లండన్‌లో ‘లివ్ ఒమన్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాకు రక్షణగా..మక్కా ఒప్పందం అమలుపై కీలక నిర్ణయం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!
- దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు







