టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- March 11, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నాయి. పంచాయతీ, మండల, మున్సిపాలిటీ, జిల్లా మరియు సిటీల స్థాయిల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కేంద్రాల ద్వారా నిరుద్యోగులు మరియు ఔత్సాహికులు స్వయం ఉపాధి పొందేందుకు మంచి అవకాశం కల్పిస్తున్నారు.
ఈ కేంద్రాల ద్వారా కొత్త పాన్ కార్డుల దరఖాస్తు, కరెక్షన్, బస్సు, ట్రైన్, విమాన టికెట్ల బుకింగ్ వంటి సేవలు అందించవచ్చు. అలాగే బ్యాంకింగ్ మనీ ట్రాన్స్‌ఫర్, ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టం, మైక్రో ఏటీఎం సేవలు, క్యాష్ డిపాజిట్లు అందుబాటులో ఉంటాయి. హెల్త్, బైక్ మరియు కార్ ఇన్సూరెన్స్ వంటి బీమా సేవలతో పాటు వివిధ రకాల బిల్లుల చెల్లింపులు కూడా చేయవచ్చు.
అంతేకాకుండా 1000 కి పైగా స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల్లో ఆన్‌లైన్ శిక్షణ, 500 కి పైగా స్కిల్ టెస్ట్ సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్లు నిర్వహించవచ్చు.100 కి పైగా ప్రభుత్వ పరీక్షల మాక్ టెస్టుల రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా ఉంది. ఆసక్తి గల వారు http://www.tsevaonline.comవెబ్‌సైట్ ద్వారా మార్చి 31, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 8179955744 నంబర్‌ను సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!









