సాయి పల్లవి డెబ్యూ మూవీ ట్రైలర్ వచ్చేసింది

- March 11, 2026 , by Maagulf
సాయి పల్లవి డెబ్యూ మూవీ ట్రైలర్ వచ్చేసింది

సాయి పల్లవి డెబ్యూ మూవీ అంటే రకరకాలుగా అనుకుంటున్నారేమో..అదేం లేదు. తన డెబ్యూ మూవీ బాలీవుడ్ లో. ఆమిర్ ఖాన్ సొంత బ్యానర్ లో ప్రొడ్యూస్ చేసిన మూవీ ఇది. అలాగే ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటించాడు. సాయి పల్లవి, జునైద్ ఖాన్ కాంబినేషన్ బావుంది అనిపించేలా ఉంది ట్రైలర్ చూస్తే. ఈ ట్రైలర్ చాలా బావుంది. ప్యూర్ లవ్ నేపథ్యంలో సాగే కథలా ఉంది ట్రైలర్ చూస్తే. విపరీతమైన మంచు కురిసే ప్రాంతంలో సాగే కథలా ఉంది. ఈ ఇద్దరి మధ్య అనుబంధం ఆకట్టుకునేలా.. రకరకాల ఎమోషన్స్ సాగేలా ఉంది. ఆమె అతన్ని ఆరాధనగా చూస్తే.. అతను ఆమెను ఆరాధించడం వీరి మధ్య సాగే కథనం కట్టిపడేసేలా ఉన్నట్టుగా ఉంది. రకరకాల ఎమోషన్స్ కనిపించేలా ఉన్నారీ ఇద్దరు. అదే టైమ్ లో ఇద్దరి మధ్య ఎడబాటు. ఆ క్రమంలో వచ్చే కథనం కూడా ఆకట్టుకునేలా ఉంటుంది అనిపిస్తోంది. మొత్తంగా చూస్తే అద్భుతమైన ఎమోషనల్ లవ్ స్టోరీలాగా కనిపిస్తోంది. ప్రధానంగా ఇద్దరి పాత్రలే హైలెట్ గా ఉండేలా ప్లాన్ చేశారు. సునిల్ పాండే డైరెక్ట్ చేసిన ఈ మూవీని మే 1న విడుదల చేయబోతున్నారు. మరి ఈ ట్రైలర్ తో సినిమాకు ఓ అంచనాకు రాలేం. బట్ ట్రైలర్ మాత్రం చాలా బావుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com