లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ తో మాగల్ఫ్ ముఖాముఖీ
- March 11, 2026
నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ 'ది ప్యారడైజ్' ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ వరల్డ్ వైడ్ సంచలనం సృష్టించింది.శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఆయా షేర్ ప్రపంచవ్యాప్తంగా టాప్ లో ట్రెండ్ అవుతూ భారీ రెస్పాన్స్ అందుకుంటుంది. 'ది ప్యారడైజ్ చిత్రం ఆగస్టు 21న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆయా షేర్ సాంగ్ లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ విలేకరలు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
'ఆయా షేర్' సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ ఎలా అనిపిస్తోంది?
- ఆయా షేర్ పాట ప్రోమో విడుదలైనప్పటి నుంచి మంచి బజ్ క్రియేట్ చేసింది.పాట రిలీజ్ అయిన తర్వాత అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టుకుంటూ అందరికీ నచ్చింది.అనిరుధ్ నేను ఇచ్చిన పదాలు తీసుకొని జనాలకి రీచ్ అయ్యేవిధంగా ట్యూన్ చేశారు. మట్టి వాసన తెలిసిన జానపద గాయకులు జంగిరెడ్డి, దేవయ్య అద్భుతంగా పాడారు.ఇంత ఫిరోషియస్ సాంగ్ లో లిరిక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
-నా కెరీర్లో ఈ పాట ఇచ్చినంత కిక్కు మరి ఏ పాట ఇవ్వలేదు.నేను ఉపయోగించిన భాష, యాసకి సోషల్ మీడియాలో చాలా అద్భుతమైన ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ పాట విన్న తర్వాత నాకు చాలా మెసేజుల వచ్చాయి.జీవితంలో సర్వస్వం కోల్పోయానని బాధపడే ఓ వ్యక్తి.. ఈ పాట విని ఒక కొత్త స్ఫూర్తి పొందానని చెప్పాడు.అలాంటి మెసేజ్లు చాలా వచ్చాయి.ఈ స్పందన నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
-ఈ సినిమాలో నాని క్యారెక్టర్ లో ఒక అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది.ఆ జడల్ వెనుక మంచి కథ ఉంటుంది.ఇప్పుడు అందరూ ఆ జడలు గురించి మాట్లాడుకుంటున్నారు.సినిమా చూసిన తర్వాత వాటికి అద్భుతమైన జస్టిఫికేషన్ ఉంది అనుకుంటారు.ఇప్పుడు అందరు కూడా జడలు వేసుకుని రీల్స్ చేస్తున్నారు.ఆ కల్చర్ ని గుర్తు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.అనిరుద్ పాట చేస్తున్నప్పుడే పెద్ద హిట్ కొడుతున్నాం అని చెప్పారు. ఆయనతో వర్కింగ్ ప్రాసెస్ ని చాలా ఎంజాయ్ చేశాను.
-ఈ పాట సక్సెస్ కి ముఖ్య కారణం డైరెక్టర్ శ్రీకాంత్.జనం నుంచి పుట్టిన ఒక వీరుడు ఆ జనాలకు స్ఫూర్తిని ఇచ్చే క్రమంలో వచ్చిన పాట ఇది.ఈరోజు అందరి నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటుంది.ఈ పాట రాయడానికి వారం రోజులు పట్టింది.కొన్ని వెర్షన్స్ డెవలప్ చేసుకుంటూ చివరికి దీనిని ఫిక్స్ చేశాం. కాకపోతే సాంగ్ సెంట్రల్ ఐడియా మాత్రం ఇమ్మిడియట్ గా లాక్ చేశాం.
-ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ చెప్పడానికి ఒక ప్రత్యేకమైన పల్లవి ఉంటే బాగుంటుంది అనుకున్నాను. ఆ ఆలోచన శ్రీకాంత్ కి నచ్చింది.ఈరోజు సోషల్ మీడియాలో అదే పల్లవి గురించి మాట్లాడుతున్నారు.
తెలంగాణ మండలికంలో పాటంటేనే మీ పేరు గుర్తొస్తుంది కదా ఎలా అనిపిస్తుంది?చాలా ఆనందంగా ఉంది. సీనియర్ కవులని స్ఫూర్తిగా తీసుకునే ముందుకు సాగుతున్నాను. కొసరాజు, జాలాది ఈ యాసతో ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందారు.నేను రాసిన ఎక్కువ పాటలు తెలంగాణ యాసలో వచ్చాయి.దాదాపు అన్ని రకాల పాటలు రాశాను.
-డైరెక్టర్ ఈ పాట గురించి పూర్తిగా వివరించారు. ఒక ఒక జాతి కష్టం నుంచి పుట్టే ఒక యోధుడు ఆ జాతికి స్ఫూర్తి నింపే నేపథ్యంలో వచ్చే పాటిది. 80 దశకాల్లో జరిగే నేపథ్యం కాబట్టి అప్పుడు ఉర్దూ ప్రభావం ఉంటుంది. అందుకే ఇందులో చాలా వరకు ఉర్దూ పదాలు ఉపయోగించడం జరిగింది.
బలగం సినిమాకి నేషనల్ అవార్డ్ అందుకోవడం ఎలా అనిపించింది?
-పల్లె భాషను నమ్ముకుని పరిశ్రమకు వచ్చాను.ఆ పల్లె భాష ఈ రోజు దేశవ్యాప్తంగా మోగడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.మరుగునపడిన భాష పదాలు నా ద్వారా మళ్ళీ వెలుగులోకి రావడం, ఈ జనరేషన్ యువత కూడా ఆ పదాల్ని వాడుకోవడం నాకు రచయితగా చాలా ఆనందాన్నిస్తోంది.
-నేను గురువుగా భావించే మా చంద్రబోస్ గారు నేషనల్ అవార్డు రాగానే నాకు ఫోన్ చేసి 'మీరు చాలా తక్కువ సమయంలో అచీవ్ చేశారు తమ్ముడు'అన్నారు. అది నాకు చాలా ఆనందాన్నిచ్చింది.
మీ జర్నీ ఎలా అనిపిస్తోంది?
నా మొదటి సినిమా చంటిగాడు.నీలపూరి గాజులు అనే పాటతో నాకు ఫస్ట్ బ్రేక్ వచ్చింది.ఆ తర్వాత చాలా సినిమాలు రాశాను.అయితే లై సినిమాతో మళ్లీ నాకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది.తర్వాత ఇస్మార్ట్ శంకర్, రాములో రాములా,డిజె టిల్లు..వరుసగా విజయవంతమైన పాటలు వచ్చాయి.
డైరెక్టర్ శ్రీకాంత్ తో ఇది రెండో సినిమా కదా..ఆయనతో పనిచేయడం ఎలా అనిపించింది?
శ్రీకాంత్ తో వర్క్ చేయడం అద్భుతమైన అనుభూతి.ఆయన చాలా ప్రశాంతంగా ఉంటారు. కానీ ఏదైనా ఒక సందర్భం చెప్పాల్సి వచ్చినప్పుడు తన ఒక ఎమోషన్ తో చెప్తారు.ఈ పాట జరుగుతున్నప్పుడు సెట్లోకి వెళ్లాను.అక్కడ నాకు ఒక సమ్మక్క సారక్క జాతర జరుగుతున్న ఫీలింగ్ కలిగింది. తన విజన్ చాలా క్లియర్ గా ఉంటుంది.ప్రతి డిపార్ట్మెంట్లో తనకున్న పట్టు, పడే కష్టం చాలా అద్భుతం.
ఫస్ట్ సినిమా కంటే ఎక్కువ కష్టం ఈ సినిమాకి పడుతున్నారు. ఆయనకి సినిమా తప్ప మరొకటి తెలియదు. ఇందులో కొన్ని సన్నివేశాలు చెప్తుంటే షాకింగ్ అనిపించింది. శ్రీకాంత్ లో ఇంత ఫైర్ దాగుందా అనిపించింది.
చిరంజీవితో చేయబోయే సినిమాలో కూడా మీ పాట ఉంటుందా?
అది ఇప్పుడే చెప్పలేను.ఇటీవల శంకర వరప్రసాదలో చిరంజీవి,వెంకటేష్ కలిసి చేసిన పాటకి నేను పాట రాయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. విశ్వంభరలో కూడా నా పాట ఉంది.పవన్ కళ్యాణ్ కి ఉస్తాద్ లో రాశాను.
నాని ఈ పాట విన్న తర్వాత ఎలా రెస్పాండ్ అయ్యారు?
- 'నాకు లైఫ్ లాంగ్ సరిపోయే కిక్ ఇచ్చారు. ధూమ్ ధామ్ దోస్తానా, చమ్కీలా అంగి, ఇప్పుడు ఆయా షేర్.. ఇలా నాకు మర్చిపోలేని హిట్లు ఇచ్చారు' అని చాలా అభినందించారు. ఇలాంటి అద్భుతమైన సెలబ్రేషన్ కి నేను రాయడం చాలా ఆనందంగా ఉందని ఆయన ప్రత్యేకంగా ట్వీట్ కూడా చేశారు
-ఈ సాంగ్ సోషల్ మీడియాలో అద్భుతంగా వైరల్ అవుతుంది. అందరిలో స్ఫూర్తి నింపే ఒక ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ అవడం చాలా ఆనందాన్నిచ్చింది.
ఈ పాట రాయడానికి ఎలాంటి హోంవర్క్ చేశారు?
డైరెక్టర్ సాంగ్ సిచువేషన్ ని చాలా క్లియర్ గా చెప్పారు. నేను నాని జడల్ క్యారెక్టర్ ని దృష్టిలో పెట్టుకున్నాను.హీరో ఎప్పుడూ కూడా పుస్తకాల్లో నుంచి పుట్టడు. కష్టం వస్తే జనం మధ్యలో నుంచి పుట్టుకొస్తాడు. అలా జనం మధ్యలో నుంచి పుట్టుకొచ్చిన ఒక వీరుని కథ ఇది. అలాంటి క్యారెక్టర్ కి ఒక ఎమోషన్ ఉంది.అందుకే పచ్చబొట్టు గాయం..గుంజుకున్న న్యాయం..ఇలాంటి పద ప్రయోగాలు చేశాను. ఈ సాంగ్ వచ్చిన తర్వాత సినిమాపై ఇంపాక్ట్ డబుల్ అయింది. కమర్షియల్ గా మార్కెట్ పరంగా స్కేల్ మారిపోయింది ఇదంతా డైరెక్టర్ శ్రీకాంత్ గారి విజన్. ఇందులో ఎమోషన్స్ యాక్షన్ అన్ని కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి.
నిర్మాత గురించి?
నిర్మాత సుధాకర్ చాలా తక్కువ మాట్లాడుతారు. కానీ ఆయన చేసిన వర్క్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది.దసరా చాలా పెద్ద కమర్షియల్ హిట్.ఇప్పుడు ఆ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఖచ్చితంగా డబుల్ ఇంపాక్ట్ ఇచ్చేలా వుంటుంది.ఈ సినిమా కోసం పారడైజ్ వరల్డ్ ని క్రియేట్ చేశారు.నిర్మాత ఎక్కడ కూడా ఖర్చుకి వెనకాడలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ అన్ బిలీవబుల్.
మీ అబ్బాయిలకి నటనపై ఆసక్తి ఉందా?
-పెద్దబ్బాయి యూఎస్ లో చదువుతున్నాడు.చిన్నవాడికి మాత్రం నటన సంగీతం అంటే ఆసక్తి ఉంది. హిందుస్తానీ సంగీతం నేర్చుకుంటున్నాడు.డాకు మహారాజ్, ఫ్యామిలీ స్టార్ చిత్రాల్లో కనిపించాడు.
ప్రస్తుతం రాస్తున్న సినిమాలు?
-లెనిన్, మా ఇంటి బంగారం, ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ రెడీగా ఉన్నాయి. ఇంకొన్ని సినిమాలు నడుస్తున్నాయి.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









