మెట్రోలో ఫోన్‌పే మ్యాజిక్
- March 12, 2026
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే వారికి డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం ఫోన్‌పే (PhonePe) తీపి కబురు అందించింది. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు (NCMC) ఫ్రేమ్‌వర్క్ కింద పనిచేసే ‘రూపే ఆన్-ది-గో’ కార్డును అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ప్రయాణికులు టికెట్ కౌంటర్ల వద్ద క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండానే నేరుగా మెట్రో గేట్ల వద్ద ‘ట్యాప్’ చేసి ప్రయాణించవచ్చు.
ఆఫ్‌లైన్ పేమెంట్స్: ఇంటర్నెట్ లేకపోయినా నో ప్రాబ్లం!
ఎలా పొందాలి?
- ప్రయాణికులు తొలి దశలో హైదరాబాద్‌లోని మెట్రో టికెట్ కౌంటర్ల వద్ద ఈ కార్డును కొనుగోలు చేయవచ్చు
- మీ ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ధ్రువీకరించాలి
- మెట్రో ఏజెంట్ ద్వారా కార్డు తీసుకుని యూపీఐ, నగదు లేదా ఇతర కార్డుల ద్వారా డబ్బులు జమ చేసుకోవచ్చు.
ప్రత్యేకతలు ఇవే..
ప్రీపెయిడ్ విధానం: ఈ కార్డులోని చిప్‌లోనే డబ్బు నిల్వ ఉంటుంది. కాబట్టి ఇంటర్నెట్ అవసరం లేకుండానే ‘ట్యాప్-అండ్-పే’ పద్ధతిలో టికెట్ ఛార్జీలు చెల్లించవచ్చు.
లావాదేవీల పరిమితి: కార్డులో గరిష్ఠంగా రూ.2,000 వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఆఫ్‌లైన్ ద్వారా ఒకేసారి గరిష్ఠంగా రూ.500 వరకు లావాదేవీలు జరపవచ్చు.
ఒక్క కార్డు..ఎన్నో ఉపయోగాలు: ఇది కేవలం హైదరాబాద్ మెట్రోకే పరిమితం కాదు. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లోని మెట్రోలు, బస్సులు, రైళ్లు, టోల్ ప్లాజాలు, పార్కింగ్ కేంద్రాల్లో కూడా ఈ కార్డును వాడుకోవచ్చు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరిన్ని రవాణా సంస్థలతో అనుసంధానం చేసి, ఈ సేవలను మరింత విస్తరిస్తామని ఫోన్‌పే పేమెంట్స్ హెడ్ దీప్ అగర్వాల్ వెల్లడించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







