మిడిల్ ఈస్ట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు

- March 12, 2026 , by Maagulf
మిడిల్ ఈస్ట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు

న్యూ ఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం వలన భారత ప్రభుత్వం తన పౌరుల రక్షణ కోసం కీలక అడుగులు వేస్తోంది.బుధవారం ఒక్కరోజే లెబనాన్, ఖతార్ దేశాల నుంచి సుమారు 700 మందికి పైగా భారతీయులు క్షేమంగా సొంత గడ్డ పై చేరుకున్నారు.

లెబనాన్ రాజధాని బీరూట్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో.. అక్కడ చిక్కుకున్న 177 మంది భారతీయ పౌరులను ఒక ప్రత్యేక చార్టర్ విమానం ద్వారా ఢిల్లీకి తరలించారు.వీరిని వారి యాజమాన్యం ఏర్పాటు చేసిన విమానంలో స్వదేశానికి పంపగా.. బీరూట్ విమానాశ్రయంలో భారత రాయబారి నూర్ రెహమాన్ షేక్ స్వయంగా వీరికి వీడ్కోలు పలికారు. లెబనాన్‌లోని భారతీయులకు అన్ని విధాలా అండగా ఉంటామని రాయబార కార్యాలయం ప్రకటించింది.

ఖతార్‌లో చిక్కుకున్న సుమారు 500 మంది భారతీయులు బుధవారం ఖతార్ ఎయిర్‌వేస్ విమానాల ద్వారా ఢిల్లీ, ముంబైలకు చేరుకున్నారు.ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మార్చి 12వ తేదీన మరిన్ని అదనపు విమానాలను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. రాయబార కార్యాలయం 24/7 హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కేవలం ఒకటి రెండు రోజుల్లోనే ‘తత్కాల్’ పాస్‌పోర్టులను జారీ చేస్తూ సేవలు అందిస్తోంది. ముఖ్యంగా ఖతార్ నుంచి వీరిని రోడ్డు మార్గం ద్వారా సౌదీకి తరలించి అక్కడి నుంచి భారత్‌కు విమానాల్లో తరలిస్తున్నారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com