కృష్ణా పుష్కరాల ప్రాధాన్యం వివరిస్తూ 'కృష్ణమ్మ పిలిచింది'
- August 01, 2016
కృష్ణా పుష్కరాల ప్రాధాన్యం వివరిస్తూ తెనాలి వాసి, కేంద్ర సెన్సారుబోర్డు సభ్యుడు, దర్శకుడు దిలీప్ రాజా 'కృష్ణమ్మ పిలిచింది' పేరుతో లఘుచిత్రం రూపొందిస్తున్నారు. ఆలూరి సుందరరామయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం విజయవాడ లబ్బీపేటలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ప్రారంభమైంది. తొలిసన్నివేశాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామిపై దర్శకుడు దిలీప్ రాజా చిత్రీకరించారు. పుష్కరాల ప్రాధాన్యం వివరిస్తూ స్వామీజీ చెప్పిన విశేషాలు తొలి ఎపిసోడ్లో ఉంటాయని దర్శకుడు తెలిపారు. కృష్ణానది పుట్టిన ప్రదేశం నుంచి హంసలదీవిలో సాగర సంగమం చేరేవరకు ఉన్న పుణ్యక్షేత్రాల విశేషాలు చిత్రంలో ఉంటాయని వివరించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చిత్రీకరణ ముగిసిన తరువాత శాటిలైట్ ఛానల్ ద్వారా ప్రసారం చేస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!







