'జీరో' సినిమా దర్శకుడు శివ్‌కి పురస్కారం

- August 01, 2016 , by Maagulf
'జీరో' సినిమా దర్శకుడు శివ్‌కి పురస్కారం

భిన్న కథాంశాలున్న సినిమాలు ఇటీవల కోలీవుడ్‌లో మరింత పెరిగాయి. దెయ్యాల కథలు ఎక్కువవుతున్న తమిళ పరిశ్రమలో అదే అంశాన్ని ఎంచుకున్నప్పటకీ.. వైవిధ్య కథను తీసుకుని 'జీరో' ద్వారా దర్శకుడు శివ్‌ మోహా గుర్తింపు సొంతం చేసుకున్నారు. సినీ విశ్లేషకుల మన్ననలను అందుకుందీ సినిమా. ప్రపంచ స్థాయిలో ప్రతిభావంతులైన సినీ కళాకారులను ఏటా రొచస్టోన్‌ సంస్థ సన్మానిస్తుంటుంది. గతంలో సౌండ్‌ ఇంజినీరు రసూల్‌పూకుట్టి, ఎస్పీబీ, గాయని వాణీజయరాంలకు కూడా ఈ సంస్థ అవార్డులు అందజేసింది. దర్శకుడిగా శివ్‌ మోహా తాజాగా . సదరు పురస్కారాన్ని అందుకున్నారు. ఈ విషయమై దర్శకుడు స్పందిస్తూ.. ''రోచస్టోన్‌కు చెందిన భారత ఉన్నతాధికారి ఇటీవల 'జీరో' సినిమాను చూశారు. మేకింగ్‌, స్క్రీన్‌ప్లేను చూసి ఆయన ఆశ్చర్యపోయారు. గ్రాఫిక్‌ సన్నివేశాలు కూడా భిన్నంగా ఉండటంతో ఫోన్‌ చేసి అభినందించారు. ఇటీవల ఆ సంస్థ ప్రతినిధులు నాకు ఉత్తమ దర్శకుడు పురస్కారాన్ని అందజేశారు. ఇది నా బాధ్యతను మరింత పెంచింది. ప్రస్తుతం క్రైం థ్రిల్లర్‌ కథతో ఓ సినిమాను రూపొందిస్తున్నా. వీలైనంత త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామ''ని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com