కువైట్లో భారతీయులపై కేంద్రమంత్రి అక్బర్ ఆరా
- August 01, 2016
భారత కేంద్ర మంత్రి ఎంజె అక్బర్, కువైట్ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ ఖాలిద్ సులేమాన్ అల్ జరాల్లాతో టెలిఫోన్లో చర్చలు జరిపారు. కువైట్లో భారతీయుల గురించి ఈ సందర్భంగా ఇరువురి మధ్యా చర్చ జరిగింది. అలాగే ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు నేతలూ చర్చించారు. కువైట్లో 850,000 మందికి పైగా భారతీయులున్నారు. కువైట్లో వీరిదే అతి పెద్ద వలసదారుల కమ్యూనిటీగా చెప్పవచ్చు. భారత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, తన సహచరుడు, సహాయ మంత్రి ఎంజె అక్బర్, కువైట్లోని భారతీయులకు సంబంధించిన వ్యవహారాల్ని పర్యవేక్షిస్తారని ట్విట్టర్ ద్వారా వెల్లడించగా, అక్బర్ సోమవారం కువైట్ మంత్రితో మంతనాలు జరిపారు.
తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







