14 నిమిషాల్లో ఇంటివద్దకే ట్యాక్సీ
- August 01, 2016
దుబాయ్‌లో ట్యాక్సీలు కేవలం 14 నిమిషాల్లోనే మీ ఇంటివద్దకు వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. ఆర్‌టిఎ కాల్‌సెంటర్‌లో కేవలం 34 సెకెన్లలోనే బుకింగ్ రిజిస్టర్ అవుతుందని ఆర్‌టిఎ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ - ట్రాన్స్‌పోర్ట్ యాక్టివిటీస్ మానిటరింగ్ డైరెక్టర్ అబ్దుల్లా అల్ మహ్రి చెప్పారు. ఈ ఏడాది ప్రధమార్ధంలో 2.9 మిలియన్ బుకింగ్ రిక్వెస్ట్‌లు వచ్చాయని ఆయన వివరించారు. తొలి ఆరు నెలల్లో 4 మిలియన్ల కాల్స్ వచ్చాయనీ, ఇందులో 1.8 మిలియన్ కాల్స్ (45 శాతం) ఐవీఆర్ సిస్టమ్ ద్వారా వచ్చాయనీ, 29,000 ట్యాక్సీ బుకింగ్స్ స్మార్ట్ ట్యాక్సీ యాప్ ద్వారా జరిగాయని వెల్లడించారు. రిజిస్టర్ చేసుకున్న తరువాత వీలైనంత త్వరగా ట్యాక్సీలను పంపించడం జరుగుతోంది. ఈ వేగాన్ని ఇంకా పెంచి, కేవలం 14 నిమిషాల్లోనే ఇంటివద్దకు ట్యాక్సీ పంపే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్పారు. 15 నిమిషాల సమయం తక్కువేమీ కాదనీ, ఒక్కోసారి అంతకన్నా ఎక్కువ సమయం పడుతున్నా అది చాలా గొప్ప విషయమని ఇమ్రాన్ కురైషి అనే ఇండియన్ ఎక్స్‌పాట్ తెలిపారు.
తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







