మస్దార్ సిటీని సందర్శించిన షేక్ మొహమ్మద్
- August 01, 2016
వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ, రూలర్ ఆఫ్ దుబాయ్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, అబుదాబీ రిన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ మస్దార్ని సందర్శించారు. మస్దార్ సిటీలో పెద్ద సంఖ్యలో అంతర్జాతీయ సంస్థలు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాలు ఉన్నాయి. రీన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన సంస్థలే అధికం ఇక్కడ. మస్దార్ ఇనిస్టిట్యూట్ కూడా ఇందులో భాగం. ప్రపంచంలో తొలి గ్రాడ్యుయేట్ లెవల్ యూనివర్సిటీగా మస్దార్ ఇన్స్టిట్యూట్ గుర్తింపు పొందింది. మస్దార్ విజిట్ సందర్భంగా షేక్ మొహమ్మద్ మాట్లాడుతూ, సరికొత్త ఆవిష్కరణల ఆవశ్యక్తను గురించి ప్రస్తావించారు. క్లీన్ టెక్నాలజీ, రీన్యూవబుల్ ఎనర్జీ వంటి రంగాల్లో యూఏఈ గణనీయ ప్రగతి సాధిస్తోందని చెప్పారాయన. సోలార్ ఇంపల్స్ ప్రపంచమంతా చుట్టేందుకు తన ప్రయాణాన్ని యూఏఈ నుంచి ప్రారంభించి, తిరిగి యూఏఈకి క్షేమంగా చేరడం పట్ల ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు షేక్మొహమ్మద్.
తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







