ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP

- March 16, 2026 , by Maagulf
ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP

మస్కట్: ఈద్ అల్-ఫితర్‌ సెలవుల సమయాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహారించాలని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) కోరారు. 

ముఖ్యంగా సెలవుల రోజుల్లో మార్కెట్లలో కార్యకలాపాలు మరియు రోడ్లపై ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందని గుర్తుచేశారు.

ఈద్ సెలవుల సమయంలో ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ భద్రతా నియమాలను పాటించడం ముఖ్యమని పేర్కొన్నారు. 

రేసింగ్, డ్రిఫ్టింగ్, ప్రదర్శనలు ఇవ్వడం మరియు వాహనాలపై నిబంధనలకు అనుగుణంగా లేని ఎగ్జాస్ట్ సిస్టమ్‌లను ఏర్పాటు చేయడం వంటి ప్రమాదకరమైన ప్రవర్తనలకు దూరంగా ఉండాలని సూచించారు. 

ప్రజా శాంతికి అంతరాయం కలిగించడం, ఇతరుల భద్రతకు హాని కలిగించడం లాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com