ఆకట్టుకుంటున్న ‘విశ్వనాధ్ & సన్స్’ టీజర్

- March 16, 2026 , by Maagulf
ఆకట్టుకుంటున్న ‘విశ్వనాధ్ & సన్స్’ టీజర్

సౌత్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తున్న తాజా చిత్రం “విశ్వనాధ్ & సన్స్” పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి వరుస విజయాలతో ఫామ్‌లో ఉన్న ప్రతిభావంతుడైన దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేయగా, సోషల్ మీడియాలో ఇది సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాకుండా భావోద్వేగాలతో నిండిన స్పోర్ట్స్ డ్రామాగా ఉండబోతుందని అర్థమవుతోంది. ముఖ్యంగా ఓ షూటర్ స్పోర్ట్స్ పర్సన్ జీవితాన్ని, అతని కష్టాలు, విజయాలు, వ్యక్తిగత జీవితం చుట్టూ కథ నడుస్తున్నట్టు టీజర్‌లో చూపించారు.ఇందులో హీరో పాత్రకు గాఢమైన భావోద్వేగాలు, జీవితంలో ఎదురైన పోరాటాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో సూర్యకు జంటగా యువ నటి అమిత బైజు నటిస్తోంది. టీజర్‌లో వీరి మధ్య ఉండే ప్రేమకథ కూడా కథలో కీలక పాత్ర పోషించనున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా హీరో 40 ఏళ్ల వయసులో ఎదుర్కొనే ప్రేమకథను దర్శకుడు చాలా హృద్యంగా చూపించబోతున్నట్టు టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈ అంశం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. టీజర్‌లో విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. షూటింగ్ రేంజ్‌లో జరిగే సన్నివేశాలు, స్పోర్ట్స్ నేపథ్యంతో రూపొందించిన సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. వెంకీ అట్లూరి గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా భావోద్వేగాలను ప్రధానంగా చూపించబోతున్నట్టు టీజర్ స్పష్టం చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com