మిల్క్‌ రెబ్డి

- July 22, 2015 , by Maagulf
మిల్క్‌ రెబ్డి

మిల్క్‌ రెబ్డి
కావలసిన పదార్ధాలు
పాలు - లీటరు
కుంకుమ పువ్వు - చిటికెడు
పంచదార - ఎనిమిది స్పూన్లు
యాలకుల పొడి - ఒక స్పూను
కెవ్డా ఎసెన్స్‌ - రెండు చుక్కలు
పిస్తా - ఒక స్పూను
తయారు చేసే విధానం
ముందుగా కుంకుమ పువ్వుని కాసిన్ని గోరువెచ్చని పాలల్లో వేసి కరిగించి పక్కన పెట్టుకోవాలి. మందపాటి బాణలిలోకి పాలు పోసి సిమ్‌లో తిప్పుతూ సుమారు ఇరవై నిముషాలు మరిగించాలి. తరువాత ప్రతి ఐదు నిముషాలకోసారి తిప్పుతూ పాలు సుమారు పావు లీటరు అయ్యేవరకూ మరిగించాలి. అప్పటికే పాలు ముక్కలు ముక్కలుగా అవుతాయి, అప్పుడు స్టవ్‌ మీద నుంచి దించి పంచదార, పాలల్లో కరిగించిన కుంకుమ పువ్వు, వేసి కలపాలి. చివరిగా కెవ్డా ఎసెన్స్‌ రెండు చుక్కలు వేసి, పిస్తా పలుకులు చల్లి ఆరాక ఫ్రిజ్‌లో పెట్టి అందించాలి.


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com