విశాఖవాసి అరెస్టు
- August 02, 2016
లాస్ ఏంజెలిస్ నుంచి నెవార్క్ వెళ్తున్న విమానంలో పక్క సీటులో కూర్చున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో విశాఖపట్నానికి చెందిన కె.వీరభద్రరావు (58)ని అక్కడి పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. నెవార్క్ ఫెడరల్ కోర్టులో మేజిస్ట్రేట్ జడ్జి జోసెఫ్ డిక్సన్ ఎదుట ప్రవేశపెట్టగా, దాదాపు రూ. 33 లక్షల సెక్యూరిటీ బాండ్ సమర్పించిన తర్వాత విడుదల చేశారు. ఆయన నేరం చేసినట్లు రుజువైతే రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 1.67 కోట్ల జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.ఆయన ప్రయాణిస్తున్న విమానం నెవార్క్‌కు జూలై 30న చేరగానే ఆయనను అరెస్టు చేశారు. లాస్ ఏంజెలిస్ నుంచి నెవార్క్ వెళ్తున్న విమానంలో వీరభద్రరావు మధ్యసీటులో కూర్చున్నారని, విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే తాను నిద్రపోయానని బాధితురాలు చెప్పారు. అయితే కాసేపటికి ఆయన తనను అసభ్యంగా తాకడంతో మెలకువ వచ్చిందన్నారు. దాంతో తాను తనతోపాటు వచ్చిన వ్యక్తితో కలిసి అతడితో గొడవ పడ్డానని తెలిపారు. జరిగినదంతా మర్చిపోవాలని... కావాలంటే ఒక డ్రింక్ కొనిపెడతానని ఆయన ఆఫర్ చేశారని, కానీ తాము మాత్రం దాన్ని తిరస్కరించి విమాన సి బ్బందికి జరిగిన విషయం చెప్పామని అన్నారు. దాంతో సిబ్బంది వీరభద్రరావును వేరే సీటులోకి మార్చారని, మళ్లీ ఈ సీటులోకి రావద్దని హెచ్చరించారని చెప్పారు. చివరకు విమానం ల్యాండ్ అయిన తర్వాత ఆయనను అరెస్టుచేసి, అనంతరం బెయిల్ మీద విడుదల చేశారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







