తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- March 20, 2026
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టి.. ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ 2026-27ను 3,24,234 కోట్లుతో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ. 2,34,406 కోట్లు కాగా.. మూలధన వ్యయం 47,267 కోట్లుగా భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ప్రస్తుతం 200 బిలియన్ యూఎస్ డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి 1 ట్రిలియన్ యూఎస్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా.. 2047 నాటికి మూడు ట్రిలియన్ యూఎస్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ఒక మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం విభాగాల వారీగా ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నామని భట్టి విక్రమార్క చెప్పారు.
బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా..
♦ వ్యవసాయం-రూ.23,179 కోట్లు
♦ విద్యుత్‌శాఖ-రూ. 21,285 కోట్లు
♦ విద్యాశాఖ-రూ.26,674 కోట్లు
♦ మహిళ, శిక్ష సంక్షేమం-రూ.3143 కోట్లు
♦ పశుసంవర్థకశాఖ-రూ.1,529 కోట్లు
♦ సివిల్ సప్లై-రూ.7,366 కోట్లు
♦ వైద్యారోగ్యశాఖ- రూ.13,679 కోట్లు
♦ రాజీవ్ యువవికాసం- రూ. 6000 కోట్లు
♦ ఎస్సీ అభివృద్ధి- రూ.11784 కోట్లు
♦ ఎస్టీ అభివృద్ధి రూ.7937 కోట్లు
♦ మైనారిటీ సంక్షేమం- రూ.3769 కోట్లు
♦ బీసీ సంక్షేమం : రూ.12,511 కోట్లు
♦ ఇరిగేషన్ -రూ.22615 కోట్లు
♦ మున్సిపల్ శాఖ- రూ.17907 కోట్లు
♦ గృహ నిర్మాణం- రూ.7430 కోట్లు
♦ ఐటీ- రూ.875 కోట్లు
♦ చేనేత- రూ.258 కోట్లు
♦ పరిశ్రమలు- రూ. 3490 కోట్లు
♦ పంచాయతీ రాజ్- రూ.33688 కోట్లు
♦ ఆర్‌అండ్‌బీ – రూ.12789 కోట్లు
♦ న్యాయ శాఖ- రూ.2367 కోట్లు
♦ హోంశాఖ- రూ. 11907 కోట్లు
♦ టూరిజం- రూ. 1224 కోట్లు
♦ గోదావరి పుష్కరాలు -రూ.500 కోట్లు
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం: ఈ పథకాన్ని జూన్ 2 నుంచి ప్రారంభించనున్నారు. కుటుంబంలో ఆదాయం తెచ్చే వ్యక్తి దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం దజేస్తారు. పేద, ధనిక అనే తేడా లేకుండా కుటుంబానికి రూ.5లక్షల జీవిత బీమా అందించే విధంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







