హైదరాబాద్ పన్ను చెల్లింపుదారులకు శుభవార్త
- March 21, 2026
హైదరాబాద్: హైదరాబాద్ పన్ను చెల్లింపుదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వచ్చే కొత్త ఆదాయపు పన్ను నిబంధనల నోటిఫికేషన్ ప్రకరారం, అద్దె ఇళ్లలో నివసించే జీతభత్యాలు పొందే ఉద్యోగులకు లభించే పన్ను రాయితీ (హెచ్ఐర్ఎ మినహాయింపు) 50శాతానికి పెంచింది. ఇంతకు ముందు ఈ మినహాయింపు 40శాతం ఉండేది. సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఈ మేరకు నిబంధనలను నోటిఫై చేసింది.
ఈ అధిక పన్ను రాయితీ కోసం ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై నగరాలతోపాటు హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ వంటి కొత్త నగరాలు కూడా చేరాయి. కానీ ఇంటి యజమాని అద్దెదారు సంబంధాన్ని వెల్లడించడాన్ని తప్పనిసరి చేసే ఆదాయపు పన్ను చట్టం, 2025కు సంబంధించిన నిబంధనలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు శుక్రవారం నోటిఫై చేసింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లోని ఉద్యోగులకు 40 శాతం మినహాయింపు అమలులో ఉంటుంది. హెచ్ఎస్ఏ పరిమితిని 50 శాతానికి పెంచడంతో హైదరాబాద్ జీతభత్యాల వర్గానికి భారీ పన్ను ఉపశమనమని చెప్పవచ్చు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







