గ్లోబల్ విలేజ్ సీజన్–31.. F&B వ్యాపారాలకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
- August 10, 2026
దుబాయ్: గ్లోబల్ విలేజ్ సీజన్–31కు సన్నాహాలు ముమ్మరమవుతున్న నేపథ్యంలో ఆహార, పానీయాల (F&B) వ్యాపారాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వాహకులు ప్రారంభించారు. F&B రంగంలోని వ్యాపారవేత్తలు, చిన్న, మధ్య తరహా సంస్థలు (SMEs), బిజినెస్ ఓనర్లు, ఫ్రాంచైజీ ఆపరేటర్లను తమ ప్రత్యేక ఫుడ్ కాన్సెప్ట్‌లతో గ్లోబల్ విలేజ్‌లో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు.
సీజన్–31లో F&B వ్యాపారాల కోసం రెండు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. ‘రెస్టారెంట్లు అండ్ కాఫీ షాప్స్’, ‘కియోస్క్స్ అండ్ ఫుడ్ ట్రాలీస్’ విభాగాల్లో వ్యాపారులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వేర్వేరు తేదీల్లో రిజిస్ట్రేషన్
రెస్టారెంట్లు, కాఫీ షాప్స్ విభాగానికి ఆగస్టు 7 నుంచి ఆగస్టు 18, 2026 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది.
కియోస్క్స్, ఫుడ్ ట్రాలీస్ విభాగానికి ఆగస్టు 13 నుంచి ఆగస్టు 26, 2026 వరకు రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తారు.
కొత్తగా ఎదుగుతున్న స్వతంత్ర F&B బ్రాండ్లు, వంటకాల వ్యాపారవేత్తలతో పాటు తమ వ్యాపారాన్ని విస్తరించాలనుకునే ఇప్పటికే స్థిరపడిన సంస్థలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
వ్యాపారులకు పూర్తి స్థాయి సహకారం
పాల్గొనే F&B సంస్థలకు గ్లోబల్ విలేజ్ తరఫున పలు రకాల సహాయాన్ని అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో అనుకూలీకరించుకునే సెటప్‌లు, సిబ్బంది వీసా సహాయం, దిగుమతి చేసుకునే ఉత్పత్తులకు కస్టమ్స్ ప్రక్రియల్లో సహకారం, స్టోరేజ్ సదుపాయాలు, రిజిస్ట్రేషన్ సపోర్ట్, ఎలక్ట్రానిక్ పేమెంట్ టెర్మినల్స్ తదితర సేవలు ఉన్నాయి.
అదనంగా, సీజన్ మొత్తం వ్యాపార నిర్వహణకు అవసరమైన మార్గదర్శకత్వాన్ని కూడా అందించనున్నారు.
90కి పైగా సంస్కృతుల సందడి
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలను ఆకర్షించే గ్లోబల్ విలేజ్‌లో వ్యాపారాలకు విస్తృతమైన అవకాశాలు లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు. 90కి పైగా సంస్కృతులకు చెందిన నివాసితులు, పర్యాటకులతో బ్రాండ్లను నేరుగా అనుసంధానించే వేదికగా గ్లోబల్ విలేజ్ నిలుస్తోందన్నారు.
గత సీజన్–30లో 250కి పైగా డైనింగ్ అవుట్‌లెట్లు సందర్శకులకు ప్రపంచవ్యాప్తంగా వివిధ రుచులను అందించాయి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు
గ్లోబల్ విలేజ్‌లో తమ ప్రత్యేక F&B కాన్సెప్ట్‌ను పరిచయం చేయాలనుకునే వ్యాపారులు అధికారిక https://business.globalvillage.ae/ బిజినెస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







