1601 సిరీస్ నంబర్లను అందుబాటులోకి తెచ్చిన TRAI..!
- August 10, 2026
న్యూ ఢిల్లీ: మొబైల్ వినియోగదారులకు వచ్చే సర్వీస్, లావాదేవీల కాల్స్‌ను సులభంగా గుర్తించేలా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకుంది. నాన్-బ్యాంకింగ్ సంస్థల కోసం ప్రత్యేకంగా 1601 సిరీస్ నంబర్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ (TRAI) చేసింది.ఈ విధానం ద్వారా సంస్థల నుంచి వచ్చే నిజమైన కాల్స్‌ను, అనుమానాస్పద కాల్స్‌ను వినియోగదారులు సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది.
యుటిలిటీస్, కొరియర్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లోని సంస్థలకు:
తొలి దశలో యుటిలిటీస్, కొరియర్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లోని సంస్థలకు ఈ 1601 సిరీస్‌ను వర్తింపజేయనున్నారు. ఆయా రంగాలకు చెందిన అర్హత కలిగిన సంస్థలు తమ కస్టమర్లకు సేవలు, లావాదేవీలకు సంబంధించిన కాల్స్ చేసేందుకు ఈ సిరీస్ నంబర్లను ఉపయోగించుకోవచ్చు. అయితే, 1601 సిరీస్ నంబర్లను అన్ని సంస్థలకు నేరుగా కేటాయించరు. టెలికాం ఆపరేటర్లు ముందుగా సంస్థల వివరాలను వెరిఫై చేస్తారు. నిర్దేశిత నిబంధనలను పాటిస్తూ అర్హత సాధించిన సంస్థలకు మాత్రమే ఈ సిరీస్ నంబర్లను కేటాయిస్తారు. దీంతో ఈ నంబర్ల వినియోగంలో పారదర్శకతతో పాటు భద్రత కూడా పెరుగుతుందని ట్రాయ్ భావిస్తోంది.
ప్రస్తుతం సాధారణ 10 అంకెల మొబైల్ నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను వినియోగదారులు తరచూ అనుమానంతో చూడాల్సి వస్తోంది. కొంతమంది వ్యక్తులు, మోసగాళ్లు సాధారణ ఫోన్ నంబర్లను ఉపయోగించి బ్యాంకింగ్, సర్వీస్ లేదా ఇతర సంస్థల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో 1601 సిరీస్ ద్వారా సంస్థల అధికారిక సర్వీస్, లావాదేవీల కాల్స్‌కు ప్రత్యేక గుర్తింపు లభించనుంది. సాధారణ 10 అంకెల నంబర్లతో మోసాలకు పాల్పడే వారిని అడ్డుకోవడంలో ఈ విధానం ఉపయోగపడుతుందని ట్రాయ్ పేర్కొంది. మొత్తంగా, వినియోగదారుల విశ్వాసాన్ని పెంచడంతో పాటు టెలికాం రంగంలో సురక్షితమైన కమ్యూనికేషన్‌కు ఈ నిర్ణయం దోహదపడనుంది.
తాజా వార్తలు
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!







