శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర సీఎం చంద్రబాబు
- March 21, 2026
తిరుమల: రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు తన సతీమణి భువనేశ్వరి, కుమారుడు మరియు మంత్రి లోకేష్ లతో కలిసి తన మనవడు చిరంజీవి నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు.ముందుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా ముఖ్యమంత్రివర్యులు ఆలయంలోకి ప్రవేశించారు.
మహద్వారం వద్దకు చేరుకోగానే అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.ధ్వజస్తంభం వద్ద నమస్కరించిన అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు.అనంతరం శ్రీ వకుళమాతను, ఆలయ ప్రదక్షణగా వచ్చి విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, యోగనరసింహస్వామి వారిని దర్శించుకుని హుండిలో కానుకలు సమర్పించారు.
శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి వర్యులకు స్వామివారి శేష వస్త్రాన్ని అందించారు. తరువాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రివర్యులకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరిలు, శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, పరాభవ నామ సంవత్సర పంచాంగం, డైరీ, క్యాలెండర్, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులను చైర్మన్, ఈవోలు అందించారు.
ఈ కార్యక్రమంలో పలువురు టీటీడీ బోర్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా అధికారులు, టీటీడీ జేఈవోలు వీరబ్రహ్మం, డాక్టర్ శరత్, సీవీఎస్వో మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత
- SATA జెద్దా–ఉగాది & ఈద్ వేడుకలు ఘనంగా నిర్వహణ
- శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర సీఎం చంద్రబాబు
- హైదరాబాద్ పన్ను చెల్లింపుదారులకు శుభవార్త
- టీమిండియా ఐర్లాండ్ పర్యటన ఖరారు..షెడ్యూల్ ఇదే!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు..
- యుద్ధం ముగిసేందుకు అమెరికా మిత్రదేశాలు సహాయపడాలి: సయ్యద్ బదర్
- అమెరికాకు శ్రీలంక బిగ్ షాక్
- ఇరాన్ దాడుల పై జీసీసీ మానవ హక్కుల సంస్థల అత్యవసర సమావేశం..!!
- హోర్ముజ్ జలసంధి పై పలు దేశాల సంయుక్త ప్రకటన..!









