బాటెల్కో సూపర్ ఫాస్ట్ ఫైబర్ నెట్
- August 02, 2016
500 ఎంబీపీఎస్ స్పీడ్‌తో రెసిడెన్షియల్ సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ ప్యాకేజీని బహ్రెయిన్‌లో ప్రవేశపెట్టడం ద్వారా ఈ రంగంలో ఈ ఘనత సాధించిన తొలి సంస్థగా బాటెల్కో రికార్డులకెక్కిందని కంపెనీ వర్గాలు వివరించాయి. సూపర్ ఫాస్ట్ ఫైబర్ ఇంటర్నెట్ ప్యాకేజ్, కుటుంబమంతటికీ ఇంటర్నెట్ వినియోగాన్ని సులభతరం చేస్తుందని బాటెల్కో ప్రతినిథులు చెప్పారు. బాటెల్కో సూపర్ ఫాస్ట్ ఫైబర్ ఇంటర్నెట్ 500 ఎంబీపీఎస్ ప్యాకేజ్‌లో 50 ఎంబీ అప్లోడ్ స్పీడ్ మరియు 1 టిబి యూసేజ్ లిమిట్ ఉంటుంది. ఈ ప్యాకేజీలో అన్లిమిటెడ్ బ్రౌజింగ్, యూట్యూబ్ స్ట్రీమింగ్, ఉచిత వారాంతపు వినియోగం వంటివి కూడా ఉంటాయి. హోమ్ బ్రాడ్ బ్యాండ్ ప్యాకేజీల విస్తరణలో భాగంగా ఈ కొత్త ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చినట్లు బాటెల్కో బహ్రెయిన్ సీఈఓ మునా అల్ హషెమి చెప్పారు. ప్రస్తుతం వేరే ప్యాకేజీల్లో ఉన్న బాటెల్కో వినియోగదారులు, కొత్త ప్యాకేజీలోకి సులభంగా అప్‌గ్రేడ్ అవ్వొచ్చు.
తాజా వార్తలు
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!







