బహ్రెయిన్‌లో 260 అక్రమ బీచ్ క్యాబిన్ల కూల్చివేత
- August 02, 2016
హిద్ మరియు డ్రై డాక్ ఏరియాలోని కోస్తా తీర ప్రాంతాల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన క్యాబిన్లను అధికారులు తొలగించారు. మొత్తం 260 క్యాబిన్లు ఈ సందర్భంగా తొలగించబడ్డాయి. వీటిని రెస్ట్ రూములుగానూ, స్టోర్ రూమ్స్గానూ వినియోగిస్తున్నారు. క్యాబిన్లు ఏర్పాటు చేయడం బహ్రెయిన్ చట్టాలకు విరుద్ధమని ముహర్రాక్ మునిసిపాలిటీ వర్గాలు వెల్లడించాయి. పబ్లిక్ ఎవరైనాసరే, ఇటువంటి అక్రమ క్యాబిన్ల గురించి సమాచారం తెలిస్తే వెంటనే అధికారిక వర్గాలకు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా కూడా అక్రమ బీచ్ క్యాబిన్లపై ఫిర్యాదు చేయవచ్చు. 1996 - చట్టం 20 ఆర్టికల్ 1 ప్రకారం పబ్లిక్ బీచ్‌లు మరియు కోస్టల్ ప్రాంతాల్ని ప్రైవేటు కార్యక్రమాలకు ఉపయోగించడం నేరం.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







