iPhoneలను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలన్న ఖతార్ NCSA..!!

- March 22, 2026 , by Maagulf
iPhoneలను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలన్న ఖతార్ NCSA..!!

దోహా, ఖతార్: iOSలో కొన్ని భద్రతా లోపాల పై Apple ఒక హెచ్చరికను జారీ చేసింది. ఈ నేపథ్యంలో iPhone వినియోగదారులు తమ పరికరాలను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని ఖతార్ జాతీయ సైబర్ భద్రతా సంస్థ (NCSA) సూచించింది.  ఈ భద్రతా లోపాలను వినియోగించుకోవడం ద్వారా హ్యాకర్లు కేవలం ఒక హానికరమైన వెబ్‌సైట్‌ను సందర్శించడం లేదా వైరస్ సోకిన లింక్‌లపై క్లిక్ చేయడం ద్వారానే గూఢచర్య కార్యకలాపాలను నిర్వహించవచ్చని, అలాగే పరికరాల నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకోవచ్చని Apple పేర్కొన్నట్లు NCSA తెలిపింది.

గత కొన్ని నెలల్లో తాము అనేక భద్రతా అప్‌డేట్‌లను విడుదల చేశామని, వాటిలో తాజా అప్‌డేట్ మార్చి 11న వచ్చిందని ఆ సంస్థ (Apple) తెలిపింది. iOS 15 నుండి iOS 26 వరకు ఉన్న కొత్త వెర్షన్‌లపై పనిచేస్తున్న పరికరాలు ఇప్పుడు ఈ దాడుల నుండి రక్షణ పొందుతాయని అన్నారు. అయితే, ఇటీవల కాలంలో iOS 13 మరియు iOS 14 వంటి పాత వెర్షన్‌లపై ఇంకా పనిచేస్తున్న పరికరాలు లక్ష్యంగా మారుతున్నట్లు తెలిపారు. ఈ సమస్యను వేగంగా పరిష్కరించేందుకు గాను, రాబోయే రోజుల్లో ఈ పాత వెర్షన్‌లకు కూడా భద్రతా అప్‌డేట్‌లు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నామని ఆ సంస్థ (NCSA) పేర్కొంది. భద్రతా అప్‌డేట్‌లు అందుబాటులోకి వచ్చిన వెంటనే వాటిని ఇన్‌స్టాల్ చేసుకోవాలని, అలాగే తెలియని వనరుల నుండి వచ్చే అనుమానాస్పద లింకులు లేదా సందేశాలను తెరవవద్దని వినియోగదారులను ఆ సంస్థ మరింతగా హెచ్చరించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com