ప్రాంతీయ భద్రత పై బహ్రెయిన్-ఈజిప్ట్ చర్చలు..!!
- March 22, 2026
మనామాః ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసికి బహ్రెయిన్ లో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో చర్చలు జరిపారు. అంతకుముందు క్రౌన్స్ ప్రిన్స్ మరియు ప్రధానమంత్రి సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా, రాజకుటుంబంలోని సీనియర్ సభ్యులు ఈజిప్ట్ అధ్యక్షుడికి స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన సోదర సంబంధాలు మరియు ఇటీవలి ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు.
ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వానికి మద్దతు ఇవ్వడంలో ఈజిప్ట్ కీలక పాత్ర పోషిస్తుందని కింగ్ హమద్ అన్నారు. అలాగే, ప్రాంతీయ సవాళ్లను ఎదుర్కోవడంలో బహ్రెయిన్ మరియు గల్ఫ్ సహకార మండలి (జిసిసి) దేశాలకు ఈజిప్ట్ అందిస్తున్న నిరంతర మద్దతును ప్రశంసించారు. బహ్రెయిన్ సార్వభౌమత్వం, భద్రత మరియు స్థిరత్వాన్ని పరిరక్షించడంలో ఈజిప్ట్ అందిస్తున్న మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు.
అలాగే, ప్రాంతీయ పరిణామాలు మరియు భద్రతపై సమీక్షించారు. ఇందులో భాగంగా, ఈ ప్రాంతంలోని దేశాలను లక్ష్యంగా చేసుకుని కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరియు దాడులను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనలుగా, ప్రపంచ శాంతికి ముప్పుగా అభివర్ణించారు. గల్ఫ్ దేశాలు మరియు జోర్డాన్పై దాడులను తక్షణమే నిలిపివేయాలని పిలుపునిచ్చారు. తమను తాము రక్షించుకునే హక్కును తెలియజేప్పే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2817 యొక్క ప్రాముఖ్యతను ఇద్దరు నాయకులు పునరుద్ఘాటించారు.
హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛను నిర్ధారించాల్సిన తక్షణ అవసరాన్ని కూడా వారు తెలియజేశారు. ప్రపంచ ఇంధనం మరియు వాణిజ్యానికి ఇది ఒక కీలకమైన అంతర్జాతీయ మార్గమని అభివర్ణించారు. సముద్ర మార్గాలను పరిరక్షించడం ఒక ఉమ్మడి అంతర్జాతీయ బాధ్యత అని ఇరు దేశాధినేతలు చెప్పారు.ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి మరియు వివిధ రంగాలలో సహకారాన్ని విస్తరించడానికి తమ నిబద్ధతను ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







