కేరళంలో షిగెల్లా వ్యాధి..
- March 22, 2026
త్రివేండ్రం: కేరళ రాష్ట్రంలోని కోళికోడ్ జిల్లాలో ప్రస్తుతం ‘షిగెల్లా’ (Shigella) బ్యాక్టీరియా కలకలం సృష్టిస్తోంది. కేరళలోని కోళికోడ్ జిల్లా, ముఖ్యంగా పెరువయల్ పంచాయతీ పరిధిలో షిగెల్లా వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 12 మందికి ఈ ఇన్ఫెక్షన్ సోకగా, ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. షిగెల్లా అనేది ఒక రకమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, ఇది ప్రధానంగా జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కలుషితమైన ఆహారం తీసుకోవడం లేదా అపరిశుభ్రమైన నీటిని తాగడం వల్ల ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ముఖ్యంగా తక్కువ రోగనిరోధక శక్తి ఉన్న ఐదేళ్లలోపు చిన్నపిల్లలు ఈ వ్యాధి బారిన పడితే ప్రాణాపాయ స్థితికి చేరుకునే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు
ఈ వ్యాధి సోకిన వారిలో ప్రధానంగా తీవ్రమైన కడుపు నొప్పి, జ్వరం, వాంతులు మరియు రక్తంతో కూడిన విరేచనాలు (Bloody Diarrhea) కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ సోకిన ఒకటి లేదా రెండు రోజుల్లోనే ఈ లక్షణాలు బయటపడతాయి. వ్యాధి తీవ్రత పెరిగితే శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి (Dehydration), కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది. సాధారణంగా ఈ బ్యాక్టీరియా బాధితుల మల విసర్జన ద్వారా పక్కన ఉన్నవారికి, ముఖ్యంగా చేతులు సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల వ్యాపిస్తుంది. ఆహార పదార్థాలపై ఈగలు వాలడం, కలుషితమైన బావి నీరు లేదా కొళాయి నీరు కలవడం వల్ల ఇది కమ్యూనిటీ స్థాయిలో ఒకేసారి చాలా మందికి సోకుతుంది.
షిగెల్లా వ్యాప్తిని అడ్డుకోవడానికి వ్యక్తిగత పరిశుభ్రత ఒక్కటే మార్గమని ఆరోగ్య శాఖ స్పష్టం చేస్తోంది. ప్రజలు తప్పనిసరిగా ఆహారం తీసుకునే ముందు, టాయిలెట్‌కు వెళ్లొచ్చిన తర్వాత చేతులను సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు శుభ్రంగా కడుక్కోవాలి. తాగునీటి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, నీటిని బాగా మరిగించి చల్లార్చిన తర్వాతే తాగాలని సూచిస్తున్నారు. పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడిగి వాడటం, నిల్వ ఉంచిన ఆహారానికి దూరంగా ఉండటం ద్వారా ఈ బ్యాక్టీరియా బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. కేరళ ప్రభుత్వం ఇప్పటికే ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







