ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- March 24, 2026
ముంబై: ఆన్‌లైన్ పేమెంట్లు చేసేవారికి బిగ్ అలర్ట్.. ఈ రోజుల్లో కూరగాయల వ్యాపారి దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ప్రతిచోటా స్మార్ట్‌ఫోన్‌లతోనే ఎక్కువ పేమెంట్ చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్లకు డిమాండ్ పెరిగినట్టే సైబర్ మోసం, ఆన్‌లైన్ మోసాలు కూడా భారీగా పెరిగిపోయాయి.
ఈ ఆన్ లైన్ మోసాలకు చెక్ పెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా కొత్త ఆన్‌లైన్ పేమెంట్ సిస్టమ్ అమల్లోకి రానుంది. ఇక సైబర్ నేరగాళ్లు మోసాలకు చెక్ పెడినట్టే..
కొత్త 2FA రూల్ ఏంటి?
ఆర్బీఐ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఇకపై ఏ ఆన్‌లైన్ లావాదేవీనైనా పూర్తి చేయాలంటే టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) తప్పనిసరి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఏదైనా పేమెంట్ చేసే ముందు కనీసం టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈ కొత్త నిబంధన ప్రకారం.. వినియోగదారులు పేమెంట్లు చేసేటప్పుడు పాస్‌వర్డ్, పిన్, ఓటీపీ, ఫింగర్ ఫ్రింట్ లేదా ఫేస్ ఐడీ వంటి బయోమెట్రిక్స్ ఏదైనా సేఫ్ మెథడ్ ఉపయోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా, ఈ మెథడ్స్‌లో ఒకటి డైనమిక్‌గా ఉండాలి. తద్వారా ఏ సమాచారాన్ని పదేపదే వాడే అవసరం ఉండదు. ఫలితంగా మోసాలు తగ్గే అవకాశం ఉంటుంది. గత కొన్నేళ్లుగా డిజిటల్ పేమెంట్లు వేగంగా పెరుగుతున్నాయి.
అదే సమయంలో ఆన్‌లైన్ మోసాలు, ఫిషింగ్, అనధికార లావాదేవీల కేసులు కూడా అంతే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. గతంలో చాలా సిస్టమ్స్ ఓటీపీలపై ఆధారపడేవి. కానీ, ఇప్పుడు హ్యాకర్లు ఓటీపీలను ఈజీగా హ్యాకింగ్ చేస్తున్నారు. ఓటీపీలు కూడా సేఫ్ కాదని ఆర్బీఐ భావిస్తోంది. అందుకే మరింత పటిష్టమైన సేఫ్ సిస్టమ్ అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది.
బ్యాంకులదే ఇక బాధ్యత:
కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఏదైనా లావాదేవీ విషయంలో మోసం జరిగితే దానికి బ్యాంకు లేదా పేమెంట్ కంపెనీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంటే.. కస్టమర్లకు ఎలాంటి నష్టం ఉండదు. నష్టపోయిన ఆ పూర్తి మొత్తాన్ని సంబంధిత సంస్థ రీఫండ్ చెల్లించాల్సి ఉంటుంది.
అదనంగా, ఆర్‌బీఐ రిస్క్-ఆధారిత అథెంటికేషన్ అమలు చేసింది. ప్రతి లావాదేవీ ఆధారంగా సెక్యూరిటీ లెవల్ నిర్ణయిస్తారు. ఉదాహరణకు.. చిన్న, సాధారణ లావాదేవీలకు తక్కువ మొత్తంలో సెక్యూరిటీ అవసరం కావచ్చు. అయితే, పెద్ద మొత్తాలు లేదా భారీ లావాదేవీలకు మాత్రం అదనపు వెరిఫికేషన్ అవసరం అవుతుంది.
ఆర్బీఐ ఈ కొత్త రూల్ ప్రకారం.. భారత్‌లో ఆన్‌లైన్ లావాదేవీలకు మాత్రమే కాకుండా అంతర్జాతీయ ఆన్‌లైన్ లావాదేవీలకు కూడా టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ రూల్ వర్తిస్తుంది. అక్టోబర్ 1, 2026 నాటికి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. తద్వారా విదేశాలలో ఆన్‌లైన్ పేమెంట్లు కూడా సెక్యూరిటీ ఉంటుంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







