11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ వైద్యులు
- March 24, 2026
హైదరాబాద్: అరుదైన మరియు క్లిష్టమైన చెస్ట్ క్యాన్సర్ ట్యూమర్ (థైమోమా)తో బాధపడుతున్న 11 ఏళ్ల బాలుడికి హైటెక్ సిటీలోని మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ వైద్యులు (డాక్టర్ రవి చందర్-సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్) విజయవంతంగా చికిత్స అందించి ప్రాణాపాయం నుండి కాపాడారు. ప్రస్తుతం ఆ బాలుడు పూర్తిగా కోలుకుని తన సాధారణ జీవితానికి తిరిగి చేరుకున్నాడు.
గత ఐదు నెలలుగా ఆ బాలుడు తీవ్రమైన ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తరచుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నాడు. మొదట సాధారణ అనారోగ్యంగా భావించిన ఈ సమస్య క్రమంగా విషమించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పరిస్థితి మరింత క్లిష్టంగా ఉండటంతో పలువురు ఆసుపత్రుల్లో వైద్యులను సంప్రదించగా, ఇది హై రిస్క్ క్యాన్సర్ ట్యూమర్ కేసుగా భావించి శస్త్రచికిత్సకు నిరాకరించారు.
ఈ నేపథ్యంలో మెడికవర్ వైద్యులను సంప్రదించగా, బాలుడిని క్షుణ్ణంగా పరీక్షించి ఛాతి మధ్య భాగమైన అన్టీరియర్ మీడియాస్టినమ్‌లో గడ్డ ఉన్నట్లు గుర్తించారు. ఈ క్యాన్సర్ ట్యూమర్ గాలి గొట్టం మరియు గుండెపై ఒత్తిడిని కలిగిస్తూ ప్రాణాపాయ పరిస్థితిని సృష్టించింది.
బయాప్సీ పరీక్షలో అది ‘థైమోమా’ అనే అరుదైన చెస్ట్ క్యాన్సర్ ట్యూమర్ అని నిర్ధారణ అయ్యింది. ఇది పిల్లల్లో చాలా అరుదుగా కనిపించే వ్యాధి. ఈ ట్యూమర్ కారణంగా శ్వాసలో ఇబ్బందులు మాత్రమే కాకుండా, అనస్థీషియా సమయంలో నరాల బలహీనత వంటి సంక్లిష్ట సమస్యలు తలెత్తే అవకాశమూ ఉంటుంది.
పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సర్జికల్ ఆంకాలజీ, పల్మనాలజీ, న్యూరాలజీ విభాగాల నిపుణులు కలిసి మల్టీడిసిప్లినరీ విధానంలో చికిత్స ప్రణాళిక రూపొందించారు. సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రవి చందర్ నేతృత్వంలో ‘స్టెర్నోటమీ’ విధానంలో శస్త్రచికిత్స నిర్వహించి, క్యాన్సర్ ట్యూమర్‌ను పూర్తిగా తొలగించారు.
శస్త్రచికిత్స అనంతరం బాలుడు వేగంగా కోలుకుని ఐదు రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా తిరిగి పాఠశాలకు వెళ్తూ సాధారణ జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తున్నాడు.
డాక్టర్ రవి చందర్-సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మాట్లాడుతూ, “పిల్లల్లో ఇలాంటి చెస్ట్ క్యాన్సర్ ట్యూమర్లు చాలా అరుదుగా కనిపిస్తాయి. లక్షణాలు సాధారణ శ్వాసకోశ సమస్యలతో పోలి ఉండటం వల్ల ప్రారంభ దశలో గుర్తించడం కష్టమవుతుంది. సకాలంలో గుర్తించకపోతే ఈ ట్యూమర్ గుండె, ఊపిరితిత్తులు, గాలి గొట్టంపై ఒత్తిడిని పెంచి ప్రాణాపాయ పరిస్థితులకు దారితీస్తుంది. ఆలస్యమైతే శస్త్రచికిత్స క్లిష్టంగా మారడమే కాకుండా, రోగి ప్రాణాపాయానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నరాల బలహీనతతో సంబంధం ఉండటం వల్ల అనస్థీషియా మరియు శస్త్రచికిత్స సమయంలో అదనపు జాగ్రత్తలు అవసరం అవుతాయి. ఈ కేసులో ఇతర చోట్ల హై రిస్క్‌గా భావించి నిరాకరించినప్పటికీ, మా నిపుణుల బృందం సమన్వయంతో విజయవంతంగా శస్త్రచికిత్స చేసి బాలుడికి పూర్తి ఆరోగ్యం అందించగలిగాం,” అన్నారు.
అరుదైన మరియు క్లిష్టమైన క్యాన్సర్ కేసులను కూడా విజయవంతంగా నిర్వహించే సామర్థ్యం, ఆధునిక సదుపాయాలు, నిపుణుల బృందం మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







