మైత్రీ తమిళ్03 అనౌన్స్మెంట్
- March 24, 2026
భారతదేశంలో విభిన్న భాషల్లో లార్జర్ దెన్ లైఫ్ చిత్రాలని రూపొందించడంలో పేరుగాంచిన మోస్ట్ డైనమిక్ నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ తమ మూడవ తమిళ చిత్రం #మైత్రి తమిళ్03ను అనౌన్స్ చేసింది. ఈ చిత్రంలో కోలీవుడ్ టాలెంటెడ్ సూరి హీరోగా నటిస్తుండగా, దర్శకుడు ఆర్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు.
ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ ఇన్టెన్స్గా, విజువల్‌గా ఆకట్టుకుంది. పోస్టర్లో హీరో వెనుక నుంచి కనిపిస్తూ, మురికిగా ఉన్న వరద నీటిలో నడుము వరకు నిలబడి ఉంటాడు. అతని ప్రతిబింబం నీటిలో కనిపిస్తూ ఒక స్యూరియల్ ఫీల్ ఇస్తోంది. కుడిచేతిలో ఆయుధం పట్టుకుని ఉండటం ప్రమాదం, బతుకుబాట మధ్య పోరాటాన్ని సూచిస్తోంది. చుట్టూ పగిలిపోయిన సామాన్లు, చెదరిపోయిన వస్తువులు, తలకిందులైన గ్యాస్ సిలిండర్.. ఇవన్నీ విపత్తు తర్వాతి పరిస్థితిని చూపిస్తున్నాయి. ముందున్న తలుపు నుంచి వచ్చే ఎర్రటి వెలుతురు ఒక ఇంటెన్స్ వాతావరణాన్ని సృష్టిస్తోంది.
నీటిలో కనిపించే ప్రతిబింబం పైన “BLOOD FOLLOWED THE FLOOD” అనే వాక్యం ఉండటం కథలో హింస, భావోద్వేగాలను సూచిస్తోంది. పోస్టర్ మిస్టీరియస్‌గా, టెన్షన్‌తో నిండి ఉండటంతో సినిమా పై ఆసక్తి పెంచుతోంది.
ఇటీవల ‘కొట్టుక్కాళి’, ‘విదుదలై’, ‘మామన్నన్’ వంటి సినిమాలతో మంచి ఫామ్‌లో ఉన్న సూరి, ఈ చిత్రంతో మరొక బలమైన పాత్రలో కనిపించనున్నారు.
దర్శకుడు ఆర్ రవికుమార్ ‘ఇంద్రు నేట్రు నాళై’, ‘అయలాన్’ వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలతో తన ప్రత్యేకతను చూపించాడు.
మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే తమిళంలో అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్యూడ్’ వంటి ప్రాజెక్టులతో విజయాల్ని అందుకుంది.
ఈ ముగ్గురు కలయికలో #Soori07 / #MythriTamil03 సినిమా ఇప్పటికే మంచి హైప్‌ను సృష్టిస్తోంది.
మేకర్స్ త్వరలో మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు.
తారాగణం: సూరి
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: ఆర్ రవికుమార్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
పీఆర్వో: వంశీ-శేఖర్ (తెలుగు)
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్‌కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్‌జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









