షకీరా దోహా కాన్సర్ట్ వాయిదా..!!
- March 25, 2026
దోహా: ఖతార్ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ప్రపంచ ప్రఖ్యాత పాప్ ఐకాన్, గ్రామీ అవార్డుల విజేత షకీరా దోహా కాన్సర్ట్ వాయిదా పడింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఖతార్ క్యాలెండర్ ప్రకటించింది.దోహాలోని 'స్టేడియం 974 'లో జరగాల్సిన షకీరా కార్సర్ట్ వాయిదా పడిందని, కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
అయితే, టికెట్ల విక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని, ఇప్పటికే కొనుగోలు చేసిన టికెట్లన్నీ కొత్త తేదీన జరిగే కార్యక్రమానికి చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేశారు. అలాగే, కొత్త తేదీని ప్రకటించిన తర్వాత, తమ టికెట్ల డబ్బును వెనక్కి పొందాలనుకునే వారి దరఖాస్తు సమర్పించడానికి రెండు నెలల గడువు ఇస్తామని ఖతార్ క్యాలెండర్ ప్రకటించింది. వాస్తవానికి ఈ కాన్సర్ట్ ఏప్రిల్ 1న 'స్టేడియం 974'లో జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన టికెట్ల విక్రయాలు ఫిబ్రవరి 10న ప్రారంభమయ్యాయి. వీటి ధరలు QAR 95 నుండి QAR 650 మధ్య ఉన్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







