కువైట్ లో భద్రతకు చెక్ పాయింట్లు కీలకం..!!
- March 25, 2026
కువైట్: జాతీయ భద్రతను పరిరక్షించడంలోనూ, చట్టాన్ని ఉల్లంఘించడానికి లేదా సామాజిక భద్రతకు భంగం కలిగించడానికి ప్రయత్నించే వ్యక్తులను పర్యవేక్షించడంలోనూ చెక్‌పాయింట్ల కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ, మేజర్ జనరల్ అబ్దుల్వహాబ్ అల్-వహిబ్ వాటి పని తీరును ప్రశంసించారని ఓ లేఖను విడుదల చేశారు. భద్రతా డైరెక్టరేట్ల వ్యవహారాల విభాగాధిపతి మేజర్ జనరల్ అహ్మద్ అల్-మునిఫీతో సహా పలువురు సీనియర్ అధికారుల సమక్షంలో పలు చెక్‌పాయింట్లను తనిఖీ చేసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
భద్రత, స్థిరత్వాన్ని పటిష్టం చేయడానికి అప్రమత్తతను కొనసాగించడం, చట్టాన్ని కఠినంగా అమలు చేయడం, ఉల్లంఘనలు లేదా ప్రతికూల పరిణామాలను పరిష్కరించడం ప్రాముఖ్యతను అల్-వహిబ్ తెలిపారు. క్షేత్రస్థాయి సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న నిరంతర అంకితభావాన్ని, కృషిని ఆయన ప్రశంసించారు. ప్రస్తుత జాతీయ మరియు ప్రాంతీయ పరిస్థితుల దృష్ట్యా చేపడుతున్న ముందుజాగ్రత్త ప్రణాళికలు మరియు చర్యలను సమీక్షించారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







