కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా!!
- March 25, 2026
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన, గత నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధాన్ని తెంచుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జగిత్యాలలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు.
గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నేతలు శతవిధాలా ప్రయత్నించారు. అధిష్టానం దూతలు ఆయనతో పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ, ఆయన మాత్రం తన నిర్ణయం మార్చుకోలేదు. పార్టీలో ఇమడలేక, మారిన రాజకీయ పరిస్థితుల్లో విధిలేని స్థితిలోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కార్యకర్తల సమావేశంలో జీవన్ రెడ్డి అత్యంత భావోద్వేగానికి లోనయ్యారు. నమ్ముకున్న సిద్ధాంతాలకు, కార్యకర్తల ఆత్మగౌరవానికి భంగం కలుగుతున్న తరుణంలో పార్టీలో కొనసాగడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన ఆయన, ఇప్పుడు కాంగ్రెస్ గూటిని వీడటం అటు పార్టీకి, ఇటు జిల్లా రాజకీయాలకు పెద్ద లోటుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ, ఫ్రాన్స్ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు
- టాలెంట్ డెవలప్మెంట్లో దుబాయ్ పోలీసులకు మిడిల్ ఈస్ట్ ఎక్సలెన్స్ అవార్డు
- 2027 నుంచి దుబాయ్‌లో డెలివరీ బైక్‌లకు స్మార్ట్ మానిటరింగ్ తప్పనిసరి
- ఈడీ మెరుపు దాడులు..రూ.1,500 కోట్ల మనీలాండరింగ్ గుట్టురట్టు
- డాలస్ లో వైభంవగా కొసరాజు సాహిత్యావిష్కరణ
- భారత్–యూఏఈ ఆవిష్కరణ రంగంలో కొత్త అడుగు..
- బాంబు బెదిరింపుల వేళ.. బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌తో కనిపించిన అమితాబ్
- హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర ప్రారంభం
- బహ్రెయిన్‌లో ప్రవాసులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనలు..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ రూల్స్..!!







