ప్రపంచ కథా దినోత్సవం సందర్భంగా 20 గంటల బుజ్జాయిల కథా మహోత్సవం
- March 25, 2026
ప్రపంచ కథా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 20న “ఊ కొడతారా” పేరుతో నిర్వహించిన బుజ్జాయిల కథా కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. తెలుగుతల్లి కెనడా, బీ పాజిటివ్, గడుగ్గాయి, తెలుగువాహిని సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 220 మంది చిన్నారులు పాల్గొన్నారు.
ఈ కథా మహోత్సవం 20 గంటల పాటు నిరంతరంగా సాగి, చిన్నారుల ప్రతిభను వెలికితీసే వేదికగా నిలిచింది. చిన్నపిల్లలు చెప్పిన కథలు శ్రోతలను అలరించడంతో పాటు కథల ప్రాముఖ్యతను చాటి చెప్పాయి.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్, ఆకాశవాణి విశ్రాంత ప్రయోక్త మడిపల్లి దక్షిణామూర్తి హాజరై చిన్నారులకు కథల విలువను వివరించి, స్ఫూర్తిదాయక సందేశాలు అందజేశారు.
ఈ భారీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తెలుగుతల్లి కెనడా కమిటీ సభ్యులు, కెనడాలోని వాలంటీర్లు నెలరోజులకు పైగా శ్రమించారు. అలాగే పలు పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులకు కథలు చెప్పడంలో ప్రత్యేక శిక్షణనిచ్చి ప్రోత్సహించారు. పిల్లలను కథల వైపు మళ్లించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విజయభాస్కర్ రాయవరం,లావణ్య బాలాంత్రపు,రత్నమాధవి రాయవరపు, డా.ఉదయశ్రీ చదలవాడ, విమలాప్రసాద్ గుర్రాల,ఝాన్సిలక్ష్మి గరిమెళ్ళ,సమత రాచమళ్ళ, జ్యోతి రాచ, సౌమ్య లింగారెడ్డి,లక్ష్మి రాయవరపు,సత్య పోతంశెట్టి తదితరులు పాల్గొని చిన్నారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష, కథా సంప్రదాయాన్ని విస్తరింపజేసే ఈ కార్యక్రమం విశేష ఆదరణ పొందింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?







