యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- March 25, 2026
యూఏఈ: యూఏఈలో రాబోయే రెండు రోజుపాటు అస్థిరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. దీనితో పాటు భారీ వర్షాలు, ఉరుములు మరియు బలమైన గాలులు వీస్తాయి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాత్రికి పరిస్థితులు క్రమంగా మెరుగుపడి, వర్షం పడే అవకాశం తగ్గుతుందని జాతీయ వాతావరణ కేంద్రం తాజా అప్డేట్ లో ప్రకటించింది.
నివాసితుల భద్రత పరమైన గైడ్ లైన్స్ ను ఫాలో కావాలని అధికారులు సూచించారు. స్మార్ట్ పార్కింగ్ యార్డులు మినహా షార్జాలో పబ్లిక్ పార్కింగ్ ఉచితంగానే కొనసాగుతుందని గుర్తుచేశారు.
దుబాయ్ ఆర్టీఏ హెచ్చరికలు
దుబాయ్ లో రాబోయే మరికొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని దుబాయ్ రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) తెలిపింది. వర్షం పడుతున్నప్పుడు, పగటిపూట కూడా విజిబిలిటీ గణనీయంగా తగ్గిపోతుందని హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని, ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, జాగ్రత్తగా వాహనాలు నడపాలని కోరుతూ ఒక సలహా జారీ చేసింది.
వెదర్ రాడార్ విశ్లేషణ
యూఏఈ లో వర్షాలు, వడగళ్ళు కురుస్తాయని అంచనా వేస్తున్న నేపథ్యంలో యూఏఈ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. వివిధ స్థాయిలలో వర్షపాతాన్ని సూచిస్తున్న వాతావరణ రాడార్ ప్రకారం.. ప్రస్తుతానికి యూఏఈకి నైరుతి దిశలో సముద్రంపై ఒక తుఫాను వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది.
రెడ్ మరియు ఎల్లో జోన్లలో తీవ్రమైన వర్షపాతం కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతానికి, ఇది యూఏఈ తీరప్రాంతం వైపు పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. దీని మార్గంలో దుబాయ్ మరియు ఉత్తర ఎమిరేట్స్ లో తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
తూర్పు యూఏఈ మరియు ఒమన్‌లోని లోతట్టు ప్రాంతాలలో కూడా తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉంది. దీంతో ఆ ప్రాంతమంతటా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని సూచించారు.
ప్రభావిత ప్రాంతాలలో భారీ వర్షం, ఉరుములు, మరియు బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. అత్యంత తీవ్రమైన జోన్లలో స్థానికంగా వరదలు సంభవించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషించారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







