శిష్యుల్లో వచ్చిన మార్పు
- July 22, 2015
గంగానదీ తీరంలో విష్ణుశర్మ అనే గురువు ఉండేవాడు. ఆయన సకల విద్యా పారంగతుడు. ఆయన వద్ద వివేకవర్మ, శౌర్యవర్మ, ఆనందవర్మ, కిషోరవర్మ అనే నలుగురు శిష్యులు ఉండేవారు. వారు చాలా వివేకవంతులే. కానీ ఏ పనినీ ఆశక్తితో, ఓర్పుతో చేసేవారు. తొందరగా అలసిపోయి, చిరాకులు పరాకులు పోయేవారు. దాంతో గురువు ఎలాగైనా వారిలో మార్పు తీసుకురావాలని తలంచాడు. ఆశ్రమంలో ఒక చోటు చూపించి అక్కడ బావి తవ్వమని సూచించాడు. తవ్వుతూండగానే.. మధ్యలో మరో మూల చూపించి ఇక్కడ తవ్వండని చెప్పాడు. అక్కడ తవ్వుతుండగా మరోచోల తవ్వమని చెప్పగా.. శిష్యులు చిరాకుతో ఇలా ఒకచోటంటే ఒక చోట అంటూ పోతే ఏ పనీ ఎప్పటికీ పూర్తి కాదు కదా అని గురువుని ప్రశ్నించారు. దానికి గురువుగారు, ఎందుకు పూర్తి కాదు. మీరు మీ విద్యాభ్యాసంలో ఇది కాస్తా అది కాస్తా చదువుతూ సంవత్సరానికి పూర్తి విధ్యనభ్యసిస్తున్నప్పుడు పని ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఎందుకు పూర్తి కాదు అని బదులిచ్చారు. దాంతో గురువు ఏం చెప్తున్నారనేది వారికి అర్ధం అయ్యి ఆ రోజునుండీ ఏ పనినైనా ఆశక్తిగా, ఓర్పుతో చేయడం అలవాటు చేసుకుని, గురువు గారి అభినందనలు పొందారు. శిష్యుల్లో వచ్చిన మార్పుకు గురువు ఎంతో సంతోషించాడు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







