లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- March 25, 2026
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (లేపాక్షి) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న క్లియరెన్స్ సేల్కు హస్తకళల ప్రేమికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మరో ఐదు రోజులు మాత్రమే గడువు ఉండటంతో వినియోగదారులు ఆసక్తిగా కొనుగోళ్లు చేస్తున్నారు. ఎంపిక చేసిన ఉత్పత్తులపై గరిష్టంగా 50 శాతం వరకు రాయితీ అందుబాటులో ఉండటంతో అన్ని షోరూమ్‌లలో సందడి నెలకొంది.
మార్చి 1న ప్రారంభమైన ఈ వార్షిక సేల్ మార్చి 31 వరకు అన్ని లేపాక్షి షోరూమ్‌లలో కొనసాగుతోంది. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే నిర్వహించే ఈ రాయితీ అమ్మకాలను వినియోగించుకునేందుకు వినియోగదారులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ సేల్‌లో కొండపల్లి బొమ్మలు, ఎటికొప్పాక కళాఖండాలు, చెక్క శిల్పాలు, కలంకారి చీరలు, బొబ్బిలి వీణ, కంచు విగ్రహాలు, రాయి శిల్పాలు, తోలుబొమ్మలాట కళాఖండాలు, పెన్ కలంకారి, సవారా ఆదివాసి చిత్రాలు, బుడిది పిత్తళి వస్తువులు వంటి విభిన్న హస్తకళా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.
విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి, అనంతపురం, హైదరాబాద్ తదితర నగరాల్లోని లేపాక్షి షోరూమ్‌లలో కొనుగోలు దారుల రద్దీ కనిపిస్తోంది. హస్తకళాకారులకు మద్దతు ఇవ్వడం, సాంప్రదాయ కళలను పరిరక్షించడం, సంప్రదాయ నైపుణ్యాలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు లేపాక్షి చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ఎండీ విశ్వ మనోహరన్ తెలిపారు.సేల్ ముగియడానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో మరింత మంది వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్‌లో కేఎఫ్‌సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్‌కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









