అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- March 26, 2026
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది.ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, పాలనపరమైన అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.ముఖ్యంగా రాజధాని అమరావతి అంశంపై ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది.
రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూ, దానికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత కల్పించేలా మంత్రివర్గం కీలక తీర్మానం చేసింది. గత కొంతకాలంగా సాగుతున్న న్యాయ, పరిపాలన పరమైన చిక్కులను తొలగించి, అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
బలహీన వర్గాల ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, మైనింగ్ లీజులను వడ్డెర సొసైటీలకు కేటాయించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖనిజ లీజుల కేటాయింపులో ప్రీమియం, సీనరేజ్ ఫీజుల్లో ఏకంగా 50% రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది వడ్డెర కుటుంబాలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.
రాష్ట్రంలో న్యాయ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు 96 జూనియర్ మరియు సీనియర్ సివిల్ జడ్జిల కోర్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల కేసుల విచారణ త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే, ప్రజలకు ఊరటనిస్తూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీని పూర్తిగా మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







