సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- July 22, 2026
రియాద్: దక్షిణ సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకుని హౌతీ మిలీషియా జరిపిన ఉగ్రదాడిని ఇటలీ, స్పెయిన్ విదేశాంగ మంత్రులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్‌తో ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ, స్పెయిన్ విదేశాంగ మంత్రి జోసే మాన్యుయెల్ అల్బారెస్ వేర్వేరుగా టెలిఫోన్‌లో చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా ప్రాంతీయ భద్రతా పరిస్థితులు, తాజా పరిణామాలపై వారు చర్చించారు. అరేబియా గల్ఫ్ మరియు ఎర్ర సముద్రంలో నౌకాయాన భద్రత, స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉందని ముగ్గురు మంత్రులు అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయ వాణిజ్య నౌకల భద్రతకు, సముద్ర రవాణాకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలనైనా తాము వ్యతిరేకిస్తున్నామని వారు స్పష్టం చేశారు. ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడేందుకు అంతర్జాతీయ సహకారం కొనసాగాలని కూడా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- దిగ్విజయంగా చికాగో NATS క్రికెట్ టోర్నమెంట్
- మూడేళ్ల క్రితం తన అరెస్టును గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు
- యూఏఈలో కార్మిక చట్ట ఉల్లంఘనలు 15 శాతం తగ్గుదల
- బాలల నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ‘పాడనా తెలుగు పాట’
- జర్మనీ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్..
- గవర్నర్ ని కలిసిన BRS నేతలు
- బిగ్‌బాస్ హౌస్‌లోకి నందన....హోస్ట్ నాగార్జునకు వార్నింగ్!
- కొత్త ప్రభుత్వ సీజన్ పై షేక్ మహమ్మద్ సమీక్ష..
- యూఏఈకి తిరిగి వస్తున్న విజ్ ఎయిర్..
- తిరుమల బ్రహ్మోత్సవాలు ఖరారు.. సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి ఉత్సవాలు







